నేను వచ్చేశా క్షమించమంటున్న రష్మికrash
2020-03-16 14:50:52

కాలం మారింది, ఒకప్పుడు సినిమా హీరోలు కానీ హీరోయిన్స్ కానీ తమ తమ అభిమానులతో టచ్ లో ఉండాలంటే వారికి పేపర్లు, వార పత్రికలే సాధనాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని అంతా ఒన్ క్లిక్ షాపీ అయిపొయింది. అయితే ఒకప్పుడు అలా అభిమానుల కోసం ఇంటర్వ్యూలు ఇవ్వ లేక పోతే బిజీ అనుకునేవారు. కానీ ఇప్పుడు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో టచ్ లో లేకపోతే మాత్రం ఏకంగా చచ్చిపోయావా అంటూ మెసేజ్ లు పెడుతున్నారు. ఈ ఉదంతం కన్నడ భామ రష్మికకు ఎదురయింది. ఎందుకో ఏమో కానీ రష్మిక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకి దూరమైంది. ఏమయిందో ఏమిటో రష్మికా సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చెయ్యడం కానీ.. ఓ పోస్ట్ చేయడం కానీ చేయ లేదు. దానితో ఫ్యాన్స్ బెంగ పెట్టేసుకున్నారు. కొందరు ఆకతాయిలు అసలున్నావా పోయావా అనే అర్ధం వచ్చేలా కూడా కామెంట్స్ చేశారనుకోండి. ఇంకొందరు ఏమో రష్మిక ఏమైంది, ఎక్కడికి వెళ్లిపోయావ్. ఇంకొందరు ఏమో నీ సోషల్ మీడియా పాస్ వర్డ్ మర్చిపోయావా, అని రష్మికకు కనిపించేలా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా సమాధానం ఇవ్వకపోతే ఇక రచ్చ చేస్తారేమో అనుకుని అందరికీ కాలిపో ఒకే రిప్లయ్ ఇచ్చింది. కొన్ని రోజులు సోషల్ మీడియా కి దూరమయ్యా.. క్షమించండి.. ఇప్పుడు నేను వచ్చేశా అంటూ రష్మిక ట్వీటేసింది. ఇంకేముంది మరి రష్మిక కమ్ బ్యాక్ అంటూ ఓ హాష్ ట్యాగ్ తో రచ్చ చేసి మరీ ఆమెకు స్వాగతం చెప్పారు ఆమె అభిమానులు. 

More Related Stories