ఆర్ఆర్ఆర్ నుండి ఆసక్తికర అప్డేట్...తారక్ త్రిపాత్రాభినయంrrr
2020-03-16 15:03:34

తెలుగు సహా ఇండియన్ సినిమా లవర్స్ బాగా ఎదురు చూస్తున్న సినిమా ఏదయినా ఉంది అంటే అది ఆర్ఆర్ఆర్ అని చెప్పక తప్పదు. బాహుబలి లాంటి సిరీస్ ని తెరకెక్కించిన దర్శకుడు, ఇద్దరు స్టార్ హీరోలు, అంతకు మించి స్టార్ క్యాస్టింగ్ ఇవన్నీ సినిమా మీద అంచనాలను ఇంకా ఇంకా పెంచేస్తున్నాయి. 2019లో రిలీజైన `సైరా: నరసింహారెడ్డి` బాహిబలి కలెక్షన్స్ ని టార్గెట్ చేసి రంగంలోకి దిగింది. కానీ అది ఎమోషనల్ గా వర్కౌట్ కాకపోవడంతో బొక్క బోర్లా పడింది. అందుకే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు జక్కన్న. ఇక ఈ సినిమా మొదలయిన నాటి నుండి వస్తున్న ఊహాగానాలా మాదిరే ఇప్పుడు మరో ఊహగానాన్ని బయటపెట్టారు కొందరు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో తారక్ ఏకంగా త్రిపాత్రాభినయం చేయనున్నాడన్న లీక్ యూనిట్ వర్గాల నుంచి లీకైంది.

ఆ మూడు పాత్రలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సినిమాలో తారక్ హైలైట్ గా నిలిచేలా చేస్తాయని అంటున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్ గా తారక్ నటిస్తున్నారు. ఆ ఇద్దరూ కలవలేదు. కానీ కలిసి ఆంగ్లేయులపై పోరాటం సాగిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని తీసుకుని జక్కన్న సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక తారక్ మూడు గెటప్పుల్లో కనిపిస్తారని చెబుతున్నారు కాబట్టి చరణ్ కి కూడా ఆ లెవల్ లోనే ఏదో ఒక ఎలివేషన్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ ఎలివేషన్ ఏమిటి అనేది చూడాలి. ఇక తారక్ వేసేది మూడు డిఫరెంట్ గెటప్పులా? లేక ముగ్గురు వ్యక్తులుగా కనిపిస్తాడా? అన్నదాని పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయనున్నారు. 

More Related Stories