రావు రమేష్.. రావు గోపాల రావు మళ్లీ బతికొచ్చాడా ఏంటి...Rao Ramesh
2020-03-17 17:05:53

విల‌క్ష‌ణ పాత్ర‌లు చేయాలంటే తెలుగులో వినిపించే ఒకే ఒక్క పేరు ప్ర‌కాశ్ రాజ్. గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఎన్నో ర‌కాల పాత్ర‌ల‌తో స్టార్ కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు ప్ర‌కాశ్ రాజ్. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు పారితోషికం ఇచ్చి మ‌రీ ప్ర‌కాశ్ రాజ్ ను పోషిస్తున్నారు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. మ‌న ద‌గ్గ‌ర ఆ స్థాయి న‌టుడు లేక కాదు.. ఉన్నా ఆ స్థాయిలో ఎవ్వ‌రూ బ‌య‌ట‌ప‌డ‌క‌. ప్ర‌కాశ్ రాజ్ ను బ్యాన్ చేసినా.. మ‌ళ్లీ రాజీప‌డి అత‌డితోనే సినిమాలు చేయాల్సిన ప‌రిస్థితి మ‌న ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల‌కు వ‌చ్చింది. ఇన్నాళ్ళూ ప్ర‌కాశ్ రాజ్ ను కొట్టే మొన‌గాడే తెలుగు ఇండ‌స్ట్రీలో లేరా అనే వాద‌న‌లు వినిపించాయి. కానీ ఇన్నాళ్ల‌కు రాజ్ కు చెక్ పెట్టే రావొచ్చారు. ఆయ‌నే రావు ర‌మేష్. 

రావు గోపాల రావ్ త‌న‌యుడిగా వ‌చ్చినా.. త‌న‌కంటూ సొంత ఇమేజ్ సంపాదించుకున్నాడు ఈ న‌టుడు. విల‌క్షణ పాత్ర‌ల‌తో తెలుగు ఇండ‌స్ట్రీలో రోజురోజుకీ త‌న ఇమేజ్ పెంచుకుంటున్నాడు. గ‌త కొన్నేళ్లలో అత్తారింటికి దారేది , ముకుందా, సినిమా చూపిస్త మావ‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, అ..ఆ.., శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు.. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్.. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్.., మొన్న విడుదలైన సాయి తేజ్ ప్రతిరోజూ పండగే ఇలా ఏ సినిమాలో తీసుకున్నా విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు రావు ర‌మేష్. విల‌న్, తండ్రి, ఫ్రెండ్ ఇలా ప్ర‌తీ పాత్ర‌లోనూ ఒదిగిపోతున్నాడు రావు ర‌మేష్. ఇక డిజే సినిమాలో రావు ర‌మేష్ మెయిన్ విలనీ అయితే అదుర్స్. అచ్చం తండ్రి పోషించిన రొయ్యల నాయుడు పాత్రకు ప్రాణం పోసాడు ఈయన. 

రావు ర‌మేష్ పూర్తిస్థాయి ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు. ఈయ‌న దెబ్బ‌కు ప్ర‌కాశ్ రాజ్ కూడా సైలెంట్ అయిపోయాడ‌నేది ఒప్పుకోవాల్సిన స‌త్యం.  కూతుర్ని ప్రాణంగా ప్రేమించే తండ్రి పాత్ర‌లో చేయాలన్నా.. హీరోను కసిగా ద్వేషించే విలన్ పాత్ర చేయాలన్నా.. అల్లుడిగా అయినా.. కొడుకుగా అయినా.. ఇలా ఏ పాత్రలో అయినా ఎంతో చ‌క్క‌గా ఒదిగిపోతున్నాడు రావు ర‌మేష్. అంతేకాదు.. కొన్ని సినిమాలు అయితే ఈయన భుజాలపై కూడా నడుస్తున్నాయి. రెమ్యున‌రేష‌న్ విష‌యంలోనూ రావు ర‌మేష్ బాగానే వెన‌కేస్తున్నాడ‌నే వార్త‌లున్నాయి. అయినా ప‌ర్లేదు.. మ‌న తెలుగు న‌టుడు అనే భావ‌న‌తో ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు కూడా రావు ర‌మేష్ ను నెత్తినెట్టుకుంటున్నారు. అంతేలెండి.. ఎక్క‌డ్నుంచో వ‌చ్చిన ప్ర‌కాశ్ రాజ్ కే కోట్ల‌కు కోట్లిచ్చిన మ‌నోళ్లు.. ఇప్ప‌టికైనా ఓ తెలుగు న‌టున్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరి.. కన్నడలో ప్యాన్ ఇండియన్ సినిమా కెజియఫ్ 2 లాంటి సినిమాల్లో రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. 

More Related Stories