నన్ను గెలికితే మీకేమి రాదంటున్న జబర్దస్త్ యాంకర్ రష్మీ.. Rashmi Gautam
2020-03-18 01:00:21

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండటం కూడా ఒక కళ. అది అందరికీ సాధ్యం కాదు. ఈ విషయంలో రష్మి గౌతమ్ చాలామంది కంటే ముందే ఉంటుంది. ముఖ్యంగా బుల్లితెరపై ఉన్న యాంకర్స్ అందరిలో రష్మి గౌతమ్ కంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాంకర్ మరొకరు కనిపించరు. ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా బాగానే జరుగుతుంది. ఇప్పుడు కూడా రష్మీ పై కొందరు  ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఆమె సీరియస్ గా స్పందించింది. 

నన్ను గెలికితే మీకేమి రాదు. మీ పని మీరు చూసుకోండి.. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటూ రివర్స్ కౌంటర్ వేసింది రష్మి గౌతమ్. విషయం ఏంటంటే కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగ్స్ నిలిపేశారు. కానీ తాను మాత్రం షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకోలేనని తెలిపింది. రాష్ట్రంలో ఎమర్జెన్సీని విధిస్తేనే అది జరుగుతుంది. కానీ అలా జరగలేదు కదా అని ప్రశ్నిస్తుంది రష్మీ. తమలో చాలా మంది కొన్ని నిర్మాణ సంస్థల్లో కాంట్రాక్టుల్లో ఉన్నామని.. వాళ్లు షూటింగ్ ను వాయిదా వేయకుంటే మేము వెళ్లాల్సిందే అని వెల్లడించింది. 

మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్లు తమ సినిమా షూటింగ్ ను అనుకున్న వెంటనే క్యాన్సిల్ చేయగలరేమో కానీ తమ లాంటి చిన్న నటీనటులకు అది సాధ్యం కాదని చెప్పింది. ఇక కరోనా వైరస్ గురించి చెబుతూ ఒకరిమీద ఒకరు ఏడవడం ఆపేసి కాస్త పరిశుభ్రంగా ఉండటానికి ప్రయత్నించండి అంటూ తనపై ట్రోల్ చేస్తున్న వారిపై సెటైర్లు వేసింది రష్మి గౌతమ్. అభిమానులు ఈ వైరస్ గురించి అవగాహన కల్పించండి అంటూ కోరుతుంది. వీలైతే వైరస్ లక్షణాలున్న వారికి సాయపడండి.. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. నన్ను ట్రోలింగ్ చేయడం వల్ల మీకేమీ లాభం రాదని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. 

More Related Stories