ఆర్ఆర్ఆర్ సెట్ నుండి మరో లీక్డ్ పిక్RRR
2020-03-18 12:09:32

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా ప్రభావం భారతదేశంలో పెద్దగా ఉండదని ముందు భావించినా ఇక్కడ కూడా కేసులు రోజురోజుకీ పెరిగి పోతున్నాయి. ఈ ప్రభావం సినీ ఇండస్ట్రీ పైనా పడుతోంది. మార్చి 31వరకు థియేటర్లకు తాళం వేసినట్లే షూటింగ్ లు కూడా క్యాన్సిల్ చేశారు. ప్రభుత్వానికి మద్దతు పలికేలా కొంత మంది నిర్మాతలు షూటింగ్ లను, సినిమా రిలీజ్ లను సైతం వాయిదా వేసుకున్నారు. ఇది పైకి కనిపించేది, కానీ అందరూ తమ తమ షూటింగ్ లు చేసేసుకుంటున్నారు. దానికి కారణం ఒకరకంగా రాజమౌళి అని చెప్పాలి. 

ఎందుకంటే ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వాయిదా వేసుకోలేదు. పెద్దగా హడావుడి లేకుండా ఈ షూట్ కానిచ్చేస్తున్నారు. కరోనా అవేర్నెస్ కోసం చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరూ కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక తాజాగా రాజమౌళి తన కుమారుడు కార్తికేయతో కలిసి ఆర్ఆర్ఆర్ సెట్స్ ను పరిశీలిస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. షూటింగ్ సమయంలో తండ్రీకొడుకులు ఆర్ఆర్ఆర్ సెట్ లను గమనిస్తూ ఉండగా తీసిన ఫోటో అది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రాజమౌళి కొడుకు కార్తికేయ ప్రొడ్యూసర్ గా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆకాశవాణి అనే సినిమా చేస్తున్నారు. ఇక జక్కన్న చేసే అన్ని సినిమాలకి ఆయన పని చేస్తాడన్న సంగతి తెలిసిందే.  

More Related Stories