నీ పోర్న్ వీడియోలు బయటపెడతా.. నమితకు వార్నింగ్.. Namitha
2020-03-18 17:32:41

ఎప్పటికప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా సైబర్ నేరగాళ్లు మాత్రం చెలరేగుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా హీరోయిన్ నమితను కూడా ఇలాగే ఒకడు వేధించాడు. ఎప్పుడూ సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేయడానికి ఏదో ఓ దారిని కనుక్కుంటూనే ఉంటారు కొందరు ఆకతాయీలు. నమిత విషయంలో కూడా ఇదే చేసాడు ఒకడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. 

రీ ఎంట్రీ కోసం చూస్తుంది నమిత. ఇలాంటి సమయంలో తనను ఓ కుర్రాడు వేధిస్తున్నాడంటూ బయటపెట్టింది నమిత. ఇది ఇప్పుడు సంచలనంగా మారుతంది. సదరు కుర్రాడి ఫోటోను హైలైట్ చేస్తూ.. ఇతగాడి పేరు సెంథమిల్ స్మిత్.. తనతో చాటింగ్ చేశాడని పోస్ట్ చేసింది. మాట్లాడాడు కదా అని తాను కూడా స్పందించానని అయితే తనను హాయ్ ఐటమ్ అని పిలిచాడని చెప్పింది ఈమె. దాంతో అతన్ని చెడామడా తిట్టేసానని.. దాంతో ఏం తెలియనివాడిలా తన ట్విటర్ హ్యాక్ అయిందని తనతో కథలు చెప్పినట్లు చెబుతుంది నమిత. 

ఆ తర్వాత వాడి దగ్గర తన పోర్న్ వీడియోలు ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేసినట్లు చెబుతుంది నమిత. తర్వాత తను నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని సవాల్ విసిరానని..  ఇలాంటి నీచులకు మనం గట్టిగా బుద్ధి చెప్పాలని.. అందుకే ఇతని ఫొటోను బయటపెడుతున్నానంటూ సంచలన కామెంట్స్ చేసింది నమిత. ఇలాంటి వెధవలు ఎందుకిలా వేధిస్తున్నారు.. నేను సినీ పరిశ్రమలో ఉండటం వల్లా.. అని నమిత ప్రశ్నించింది. మొత్తానికి ఈ కుర్రాడిపై ఇప్పుడు సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకుంటుంది. 

More Related Stories