రామ్ చరణ్ కు అదిరిపోయే షాక్ ఇచ్చిన అక్క సుష్మిత..charan
2020-03-20 14:15:49

నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అదిరిపోయే షాక్ ఇచ్చింది మెగా డాటర్. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు చెప్పింది సుష్మిత కొణిదెల. ప్రస్తుతం ఈమె తెలుగు ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తుంది. కేవలం తండ్రి సినిమాలకు మాత్రమే ఇప్పటి వరకు కాస్ట్యూమ్ డిజైన్ చేస్తూ వచ్చింది. ఇప్పటి నుంచి బయటకు సినిమాలకు కూడా చేస్తాను అని చెప్తుంది సుష్మిత. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్, అల్లు అర్జున్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది ఈమె. ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్, బన్నీలలో ఎవరు బెస్ట్ డాన్సర్ అని చిరంజీవి కూతురును అడిగితే మరో అనుమానం లేకుండా అల్లు అర్జున్ ముందు వస్తాడని చెప్పింది.

తన తమ్ముడు రామ్ చరణ్ కంటే బన్నీ బావ అద్భుతంగా డాన్స్ చేస్తాడు అని చెప్పింది ఈమె. చిన్నప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ డాన్సుల గురించి మాట్లాడుకునే వాళ్ళం అని క్లారిటీ ఇచ్చింది సుష్మిత. తమ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా బన్నీ డాన్స్ చేసేవాడు అని చెప్పింది. చరణ్ డాన్స్ చేస్తాడు కానీ అల్లు అర్జున్ కంటే మాత్రం కాదు అని క్లారిటీ ఇచ్చింది చిరంజీవి కూతురు. మరో అనుమానం లేకుండా బన్నీ బెస్ట్ డాన్సర్ అని సర్టిఫికెట్ ఇచ్చేసింది. చరణ్ కూడా బాగానే చేస్తాడు కానీ బన్నీ స్థాయిలో మాత్రం కాదని నిజం ఒప్పుకుంది ఈ మెగా డాటర్. ఈమె చెప్పిన సమాధానం కొందరు రామ్ చరణ్ అభిమానులకు నచ్చడం లేదు.

More Related Stories