వర్మ కెరీర్ గ్రాఫ్ మీద హీరోయిన్ బాధ...అందుకేనాRam Gopal Varma
2020-03-21 17:49:00

శివ లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమా తీసిన వర్మ ఆ తరువాతి కాలంలో బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయ్యారు. అయితే చాలా కాలంగా ఆయన నుండి చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ రాలేదు, కిల్లింగ్ వీరప్పన్ తరువాత. ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళ పరువు తీయడానికి ఆయన చూపిస్తున్న ఇంటరెస్ట్ సినిమాలు తీయడం మీద పెట్టడం లేదన్న వాదన ఆయన అభిమానుల నుండే వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు వర్మ బ్యాడ్ టైం గురించి ఒక భామ తెగ బాధ పడిపోతోంది. ఆమె ఎవరో కాదు ఇషా కొప్పికర్. ఆమె గతంలో వర్మ తెరకెక్కించిన ఒక సూపర్ హిట్ సినిమా అయిన కంపెనీలో నటించింది. ఆ సినిమాలో నటించడమే కాక వర్మ ప్రొడక్షన్‌లో డార్లింగ్‌, షాబ్రీ సినిమాలోనూ కనిపించారు. ఆమె ఇప్పుడు వర్మ బ్యాడ్ టైం గురించి బాధ పడుతోంది. 

వర్మ అనేక గొప్ప సినిమాలు తెరకెక్కించారని, ఆయన గతంలో తీసిన సినిమాలను ఒకసారి గుర్తు తెచ్చుకోమని ఈ భామ చెబుతోంది. ప్రస్తుతం బ్యాడ్ టైంలో ఉన్న వర్మ తన రాబోయే చిత్రాల ద్వారా పూర్వ వైభవాన్ని సాధిస్తాడని ఆశిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే ప్రస్తుతానికి వర్మ ప్లాన్ చేస్తున్న వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ పూర్తి అయ్యిందని, ఈ వెబ్‌ సిరీస్‌ను వర్మ నేతృత్వంలో నలుగురు దర్శకులు డైరెక్ట్ చేశారని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ మళ్ళీ ప్రేక్షకుల్లో వర్మ మీద నమ్మకాన్ని నిలబెడుతుందని ఆశిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. కొంత కాలంగా దూరంగా ఉంటున్న ఇషా కొప్పికర్ వర్మ వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీకి సిద్దం అయ్యింది. ఈ సిరీస్‌తో పాటు తమిళ మూవీ అయలాన్‌ లోనూ నటిస్తున్నారు. ఆర్‌ రవికుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శరద్‌ కేల్కర్‌ కూడా కీలక పాత్రలలో నటిస్తున్నారు.  

More Related Stories