రజినీకాంత్ నిజంగానే వైల్డ్ నాయనో.. కొండలెక్కేసాడుగా..Rajinikanth
2020-03-21 18:21:31

ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ఇండియా నుంచి మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోకు వెళ్లిన మరో ప్రముఖుడు రజినీకాంత్. ఈయన ఆ మధ్య మూడు రోజుల పాటు ఈ షో షూటింగ్ చేసాడు. డేట్స్ కూడా ఇచ్చిన తర్వాత తొలి రోజే అనుకోకుండా గాయపడ్డాడు. కర్టాటకలోని బందిఫుర రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ షూటింగ్ జరిగింది. షో హోస్ట్ బేర్ గ్రిల్స్ కూడా రజినీకాంత్ తో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఆయనతో కొన్ని గంటల పరిచయంలో తాను ఎన్నో నేర్చుకున్నానని చెప్పాడు. ఈ షూటింగ్ చేస్తుండగానే రజినీకాంత్ గాయపడ్డాడు. కానీ వెంటనే కోలుకుని షూటింగ్ పూర్తి చేసాడు సూపర్ స్టార్. అసలే ఈ మధ్య అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయనకు గాయాలు కావడం ఆందోళన కలిగించింది. దాంతో ఇందులో ఎలా ఉంటాడో అని అంతా అనుకున్నారు. 

అయితే ఇప్పుడు విడుదలైన ప్రోమో చూస్తుంటే అసలు రజినీకాంత్ కు నిజంగానే 70 ఏళ్లున్నాయా అనే అనుమానం రాక మానదు. ఇదే ప్రశ్న రజినీని గ్రిల్స్ కూడా అడిగాడు. దానికి నవ్వుతూ 70 అని చెప్పాడు రజినీకాంత్. మీరు అంత ఏజ్ అంటే నమ్మలేం.. చాలా ఫిట్ గా ఉన్నారని కితాబిచ్చాడు బేర్. ఇదిలా ఉంటే ఈ ప్రోమోలో హోస్టుతో కలిసి కొండలు, గుట్టలెక్కడమే కాదు సాహసాలు కూడా చేసాడు సూపర్ స్టార్. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్ విడుదలైతే కచ్చితంగా సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నారు అభిమానులు. ఈ ఎపిసోడ్ చూస్తుంటే నిజంగానే రజినీ చాలా వైల్డ్ అనేది అర్థమవుతుంది. 

More Related Stories