కరోనా కోరల నుంచి ప్రాణాలతో బయటపడిన హీరోయిన్..coronavirus
2020-03-24 15:01:13

కరోనా వచ్చిందంటే ఏం చేయాలో.. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా ఇప్పుడు చాలా దేశాలకు అర్థం కావడం లేదు. రోజురోజుకీ కరోనా మరణాలు కూడా పెరిగిపోతుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా కర్ఫ్యూ విధించాయి. ఆంధ్రా, తెలంగాణలో కూడా లాక్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇక ఇప్పుడు దీని బారిన పడి ప్రాణాలు రక్షించుకుంది హీరోయిన్ ఓల్గా కురిలెంకోకి. పది రోజులు కింద ఈమె కరోనా బారిన పడింది. అయితే వెంటనే ఐసోలేట్ అయిపోయి.. ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. ఈ పది రోజులు కూడా తన కుటుంబంలో కూడా ఎవరిని తన దగ్గరికి రానీకుండా జాగ్రత్త పడింది. చివరికి కొడుకును కూడా దూరంగా పెట్టింది. తనను తాను సెల్ఫ్ క్వారెంటైన్ చేసుకోవడమే కాకుండా డాక్టర్లు చెప్పింది పాటించింది. దాంతో కరోనా నుంచి పూర్తిగా క్యూర్ అయిపోయింది ఈమె. కరోనా సోకితే అది ఎవరికి సోకకుండా క్వారెంటైన్ చేసుకోవాలని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. విటమిన్ బీ5.. విటమిన్ ఈ.. విటమిన్ సీ.. జింక్ ఎంతగానో సహకరిస్తాయని.. ఇవి వాడిన తర్వాతే తనకు జ్వరం కూడా తగ్గిందని చెప్పింది బాండ్ గాళ్. తనకు డాక్టర్లు పారాసెటమాల్ తప్ప ఇంకేం ఇవ్వలేదని.. జాగ్రత్తలు చెప్పలేదని మండిపడింది ఓల్గా. కరోనాని ధైర్యంగా ఎదుర్కోవడాన్ని చూసి ప్రేక్షకులు కూడా ఆమెను అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈమెకు కరోనా వచ్చిందని తెలిసి బాయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా వదిలేసాడనే ప్రచారం కూడా జరుగుతుంది.

 

More Related Stories