మలైకా ఆంటీ.. కెవ్వు కేక మీ అందం కెవ్వు కేక..  Malaika arora
2020-03-24 20:00:32

మ‌లైకా అరోరా.. ఈ పేరు అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కానీ కెవ్వుకేక అంటే మాత్రం ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. హిందీలో ఛ‌య్య ఛ‌య్య అంటూ ర‌చ్చ చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో మాత్రం రాత్రైనా నాకు ఓకే అంటూ మ‌హేశ్ తో.. కెవ్వుకేక అంటూ ప‌వ‌న్ తో చిందేసింది. ఈ రెండు పాట‌లు సూప‌ర్ హిట్. ముఖ్యంగా బాలీవుడ్ లో ఐటం సాంగ్స్ కు ప్ర‌త్యేత గుర్తింపు తెచ్చింది మ‌లైకా. హీరోయిన్ల‌తో స‌మానంగా ఇప్ప‌టికీ ఈ భామ‌కి చాలా క్రేజ్ ఉంది. వ‌య‌సు 50కి చేరువవుతున్నా కూడా ఇప్ప‌టికీ కుర్ర హీరోయిన్లు కూడా కుళ్ల‌కునే ఫిజిక్ మెయింటేన్ చేస్తుంది మ‌లైకా. ఇక ఇప్పుడు మ‌ళ్లీ త‌న అందంతో ర‌చ్చ చేసింది మ‌లైకా. 

తాజాగా జిమ్ నుంచి బయటికి వస్తున్న ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్ డౌన్ అయినా.. కరోనా వచ్చినా కూడా జిమ్ వర్కవుట్స్ మాత్రం మానడం లేదు ఈ ముద్దుగుమ్మ. ఆ మ‌ధ్య మాజీ భ‌ర్త అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ.. అర్జున్ క‌పూర్ తో ఎఫైర్ న‌డుపుతుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు చెడగొడుతుంది మ‌లైకా. 47 ఏళ్ల వ‌య‌సులో తాజాగా మ‌లైకా మ‌రో హాట్ ఫోటోషూట్ చేసింది. ఆ మధ్య స్విమ్మింగ్ పూల్ లో అమ్మ‌డి అందాల ఆర‌బోత చూసి ఆహా ఓహో అనుకుంటూ లొట్ట‌లేస్తున్నారంతా. ఇక ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఏజ్ పెరుగుతున్నా కూడా త‌న‌లో ఇంకా వ‌న్నె త‌ర‌గ‌లేద‌ని నిరూపిస్తూ కెవ్వుకేక పెట్టిస్తుంది మ‌లైకా అరోరాఖాన్.

More Related Stories