రిస్క్ చేస్తున్న శర్వా...తమిళ సినిమాకి Sharwanand
2020-03-25 19:00:26

మొన్నటి వరకూ శర్వానంద్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకరు. అతడి సినిమాకి మినిమం గ్యారెంటీ ఉండేది. రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి విజయాలతో అతను ఓ దశలో దూసుకెళ్ళి మార్కెట్‌ ను పెంచుకున్నాడు. ఆ తరువాత రెండు మూడు సినిమాలు దెబ్బ వేయగానే ఆ మార్కెట్ పడిపోయింది. మరీ ముఖ్యంగా చిర్వరిగా వచ్చిన ‘జాను’ కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఈ సినిమా కనీసం ఐదు కోట్ల షేర్ కూడా వసూలు చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనోడు ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్నాడు. జాను డిజాస్టర్ కావడంతో ఆ సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. దీనికే సరైన బిజినెస్ జరగట్లేదు. ఇలాంటి టైంలో శర్వా పెద్ద రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడనే వార్త హల్చల్ చేస్తోంది. 

అదేంటంటే ఆయన తరువాతి సినిమా తమిళంలో రాజు సుందరం దర్శకత్వంలో శర్వా చేయనున్నాడట. కొరియోగ్రాఫర్ అయిన రాజుసుందరం అన్ని భాషల సినిమాలకి నృత్యదర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నా కొన్ని సినిమాల్లో నటిస్తున్ను కూడా, ఈయన గతంలో దర్శకుడిగా అవతారమెత్తి అజిత్‌ హీరోగా ఏగన్‌ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో రాజు సుందరం ఆ తరువాత దర్శకత్వం జోలికి పోలేదు. అలాంటిది మరోసారి మెగాఫోన్‌ పట్టడానికి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. 

శర్వా తమిళ వారికీ సుపరిచితమే ఇంతకుముందు ‘ఎంగేయుం ఎప్పోదుం’ (జర్నీ)లో నటించి మంచి గుర్తింపు సంపాదించాడు. నిజానికి రాజు సుందరం తెలుగులో ‘కిరాక్ పార్టీ’ని డైరెక్ట్ చేయాల్సింది. కానీ స్క్రిప్టు దశలో అతడి పనితనం నచ్చక పక్కన పెట్టారనే టాక్ ఉంది. ఎటూ తీసిన అజిత్‌ సినిమా డిజాస్టర్ అయింది. అలాంటి దర్శకుడితో ఈ టైంలో తమిళ సినిమా ఏంటో మరి శర్వానే ఆలోచించుకోవాలి. 

More Related Stories