ట్విట్టర్ లో వైరల్ అవుతున్న చిరుకు ఎన్టీఆర్ రిప్లైntr
2020-03-26 19:45:22

నిన్న ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి ట్వీట్‌ లో క‌రోనా మ‌హ‌మ్మారి గురించి అవగాహన పెంచే విధంగా ప‌లు సూచ‌న‌లు చేసిన చిరు కొద్ది సేప‌టి త‌ర్వాత ఆర్ఆర్ఆర్ మోష‌న్ పోస్టర్ వీడియో ని ప్రశంసిస్తూ మరో ట్వీట్ చేశారు. ఈ పోస్టర్ లో రాజ‌మౌళి, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల ప‌నితనం బాగుంద‌ని పేర్కొన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ మోష‌న్ పోస్టర్‌ ని ప్రశంసించిన నేప‌థ్యంలో ఇప్పటికే రాజ‌మౌళి మెగాస్టార్‌ కి ట్విట్టర్ ద్వారా ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలిపారు. తాజాగా ఈ ట్వీట్ కి జూనియ‌ర్ ఎన్టీఆర్‌ కూడా స్పందించారు. మీ విలువైన మాట‌ల‌కి ధ‌న్యవాదాలు స‌ర్‌, మీ నుండి వ‌చ్చే ప్రతి మాట‌లో చాలా అర్ధం ఉంటుంది. ట్విట్టర్ ప్ర‌పంచంలోకి అడుగుపెట్టిన మీకు గ్రాండ్ వెల్‌క‌మ్ చెబుతున్నాం అని ఎన్టీఆర్ సవినయంగా ట్వీట్‌ చేశారు.  ఇక చిరంజీవి కొత్త ఊపులో అందరి ట్వీట్స్ ని రీ ట్వీట్ చేస్తూ ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నారు. ఎటూ ఖాళీగానే ఉన్నారు కాబట్టి ఆ పనిలో ఉన్నట్టున్నారు.

 

More Related Stories