అనసూయ మొర దేవుడు విన్నట్టున్నాడుana
2020-03-28 03:21:35

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలే పరిస్థితి తీవ్రతను అర్థం అయ్యేలా చెబుతున్నాయి. ఇప్పటికే భారత్ మొత్తం ఏప్రిల్ 14 దాకా లాక్ డౌన్ ప్రకటించారు మోడీ. కానీ అంతకు ముందే తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 31 వరకు లాక్ డౌన్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. అంటే అత్యవసర పరిస్థితుల్లో మినహా ఎవరూ ఇంటి నుంచి బయటికి అడుగు తీసి పెట్టలేరు. ఈ లాక్ డౌన్ కారణంగా అత్యవసర పరిస్థితులు.. నిత్యవసర సరుకుల విషయంలో మాత్రమే బయటికి రావాలని.. అది కూడా ఇంటికి ఒక్కరు మాత్రమే రావాలనే ఆదేశాలు ఉన్నాయి. అయితే ఈ విహాయం మీద కేసీఆర్ ప్రకటించిన వెంటనే జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ భిన్నంగా స్పందించింది. ట్విట్టర్‌లో కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ కేటీఆర్ సర్.. ప్రభుత్వం చెప్పింది పాటించాలి.. కానీ కొన్ని ప్రొఫెషన్స్ విషయంలో మాత్రం ఈ పద్దతులు సడలించండి.. మేం పని చేయకపోతే మాకు డబ్బులు రావు.. కానీ మేం మా ఇంటి రెంట్ కట్టుకోవాలి.. కరెంట్ బిల్లు కట్టుకోవాలి..ఈఎంఐలు కట్టాలి. నెలసరి బిల్స్ కూడా ఉంటాయి. కాబట్టి కాస్త మాపై దయ చూపించండి అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆమె మీద రకరకాల కామెంట్స్ తో విరుచుకు పడ్డారు అనుకోండి. అయితే ఆ దేవుడు ఈమె మొర విన్నట్టు ఉన్నాడు. అందుకే కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాంకులకు రుణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. దీంతో అనసూయ మొర దేవుడు విన్నట్టున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు..

 

More Related Stories