మహేష్ గారు.. కాస్త మారండి సర్.. ఇంకా దర్శకులున్నారు..mb
2020-03-29 03:38:50

ఇప్పుడు అభిమానులు కూడా ఇదే అంటున్నారు. ఇండస్ట్రీలో రిపీట్ కాంబినేషన్స్ నమ్మడంలో ముందుండే హీరో మహేష్ బాబు. తనకు ఒక్క హిట్ ఇస్తే చాలు.. మరో సినిమాకు పర్మిషన్ ఇచ్చేస్తుంటాడు ఈయన. ఇండస్ట్రీలో మిగిలిన హీరోలతో ఒక్క సినిమా కూడా చేయని దర్శకులతో కూడా ఒకటికి రెండుసార్లు పనిచేసాడు సూపర్ స్టార్. అరే.. తనకు ఒక్కడు లాంటి సినిమా ఇచ్చాడని గుణశేఖర్ తో మూడు సినిమాలు చేసాడు ఈయన. ఒక్కడు, అర్జున్, సైనికుడు సినిమాలకు కలిసి పనిచేసారు ఈ జోడీ. అతడు ఇచ్చాడని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఖలేజా సినిమా చేసాడు. ఇక దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా గిఫ్టుగా ఇచ్చాడని.. ఆగడుతో మరోసారి శ్రీనువైట్లకు ఛాన్స్ ఇచ్చాడు. పూరీ జగన్నాథ్ తో కూడా పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలు చేసాడు ఈయన. ఇక శ్రీమంతుడు సినిమా ఇచ్చాడని కొరటాలకు వెంటనే భరత్ అనే నేను సినిమా ఇచ్చాడు. సీతమ్మ వాకిట్లో లాంటి మంచి సినిమా ఇచ్చాడనే కృతజ్ఞతతోనే సరిగ్గా కథ కూడా వినకుండా శ్రీకాంత్ అడ్డాలపై ఉన్న నమ్మకంతో బ్రహ్మోత్సవం లాంటి సినిమా చేసి డిజాస్టర్ మూట గట్టుకున్నాడు మహేష్ బాబు.

రిపీట్ కాంబినేషన్ చేయడంలో మహేష్ అందరికంటే ముందుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు ఈయన. సరిలేరు నీకెవ్వరు సినిమా ఇచ్చాడని అనిల్ రావిపూడితో వెంటనే మరో సినిమా కావాలంటున్నాడు. కానీ కాస్త టైమ్ ఇస్తే కథ సిద్ధం చేస్తాను కానీ మరీ మూడు నెలలంటే కష్టం అంటున్నాడు అనిల్. చాలా ఏళ్ళ తర్వాత పరుశురామ్ అంటూ కాస్త కొత్త కాంబినేషన్ తో వస్తున్నాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ అడిగినా కూడా టైమ్ కావాలి.. ఎఫ్ 3 తర్వాతే మీకు కథ అంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే కొన్ని రోజులు వేచి చూసి పరుశురామ్ తర్వాత అనిల్ సినిమా చేయలనుకుంటున్నాడు మహేష్. మొత్తానికి ఎటు చూసుకున్నా కూడా రిపీట్ కాంబినేషన్స్ చేస్తూ వరసగా సినిమాలు చేస్తున్నాడు సూపర్ స్టార్. అప్పుడప్పుడూ ఇతర దర్శకుల వైపు కూడా చూస్తే బాగుంటుందేమో మరి..?

More Related Stories