కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఏమి మాట్లాడటం లేదు ఏంటి..mohan
2020-03-29 09:07:40

ఇండస్ట్రీలో ఏదైనా విషయం గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు మోహన్ బాబు చాలా గట్టిగా తన గళం వినిపిస్తాడు. ఈ విషయం అందరికీ బాగా తెలుసు. సూటిగా సుత్తి లేకుండా ఒక విషయాన్ని చెప్పేస్తాడు మోహన్ బాబు. ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు కూడా పెద్దగా ఆలోచించకుండా తనకు తోచింది చేసేస్తాడు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ బాధితుల విషయంలో మాత్రం ఎందుకో మోహన్ బాబు వెనకడుగు వేస్తున్నాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు మొత్తం సినిమా కార్మికులతో పాటు ముఖ్యమంత్రుల సహాయనిధికి కూడా ఆర్థిక సహాయం అందించారు. తన తోటి నటులు మొత్తం విరాళాలను అందిస్తుంటే ఇప్పటి వరకు కలెక్షన్ కింగ్ మాత్రం ఏమీ మాట్లాడలేదు. విరాళం గురించి టాపిక్ తీయడం లేదు. ఆయన మాత్రమే కాదు మంచు మనోజ్, మంచు విష్ణు కూడా ఇప్పటివరకు విరాళం గురించి ఎక్కడ ఊసే ఎత్తలేదు. దానికి తోడు మోహన్ బాబు ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఉన్నాడు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎన్నికలకు ముందు చేరాడు మోహన్ బాబు. అలా చూసుకున్నా కూడా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి అయినా కూడా మోహన్ బాబు సాయం చేయాలి కదా అని అడుగుతున్నారు విశ్లేషకులు. కొన్ని రోజులు ఆగి పరిస్థితి చూసి విరాళం ప్రకటించాలని మోహన్ బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాస్త ఆలస్యం అయినా కూడా ఖచ్చితంగా భారీగానే ఇస్తాడని నమ్ముతున్నారు ఆయన అభిమానులు.

More Related Stories