రొమాంటిక్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ కి తెలుగు భామ..esha
2020-03-29 18:40:02

తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పట్లో మెరిసిన భామలంతా తెలుగు వారే..కానీ ఇప్పుడు అభిమానుల అభిరుచి మారడం దర్శకులు కోరినంతగా మనదగ్గర తెలుగు హీరోయిన్ లు ఎక్సపోసింగ్ చేయలేకపోవడంతో టాలీవుడ్  మొత్తం ముంబై, గోవా లాంటి ఇతర రాష్ట్రాల భామలతోనే నిండిపోయింది. కొన్ని సినిమాల్లో అయితే ఏకంగా విదేశాల నుండి వచ్చిన హీరోయిన్ లు కూడా నటిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు భామ ఇషా రెబ్బా మాత్రం హిందీలో సూపర్ హిట్టయిన లస్ట్ స్టోరీస్ లో ఛాన్స్ కొట్టేసింది. అయితే హిందీలో లస్ట్ స్టోరీస్ ను నలుగురు దర్శకులు చిత్రించారు. కాగా అందులో కియారా అద్వానీ రెచ్చిపోయి నటించింది. ఎక్స్పోసింగ్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. అయితే ఇప్పుడు నెట్ఫ్లిక్  తెలుగులో లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ను తీయడానికి సిద్ధమైంది. కాగా దానిలో నటించే ఛాన్స్ ఇషా రెబ్బా  కొట్టేసింది. తెలుగు సిరీస్ లోను రొమాన్స్ గట్టిగానే ఉంటుందని టాక్.
ఇదిలా ఉండగా ఇషా రెబ్బా "అంతకు ముందు ఆ తరువాత" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అందం తో పాటు మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేతలో నటించే అవకాశం అంది పుచ్చుకుంది. కానీ ఆ సినిమాలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేకపోవడంతో ఆ తరువాత పెద్దగా ఆఫర్ లు దక్కలేదు. కాగా ఇప్పుడు ఇషా లస్ట్ స్టోరీస్ తో తన టాలెంట్ మొత్తం ప్రూవ్ చేసుకునే అదృష్టాన్ని దక్కించుకుంది.

More Related Stories