కరోనాతో ప్రముఖ గాయకుడు కన్నుమూత.. Joe Diffie
2020-03-30 14:50:41

కరోనా బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 32 వేల మందికి పైగా కన్నుమూసారు. అందులో కొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఓ హాలీవుడ్ నటుడితో పాటు హీరోయిన్ తండ్రి కూడా చనిపోయారు. ఇఫ్పుడు మరో గాయకుడు కూడా చనిపోయాడు. అమెరినక్ పాపులర్ సింగర్ జోయ్ డిఫ్పీ కరోనాతో కన్నుమూసాడు. మూడు రోజుల క్రితం జోయ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు ఈయన. సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు జోయ్. అయితే కనీసం మూడు రోజులు కూడా ఈయన శరీరం తట్టుకోలేకపోయింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కూడా ఈయన్ని కాపాడలేకపోయారు. డాక్టర్లు చూస్తున్నారు.. అభిమానులకు ఎలాంటి భయం అక్కర్లేదని చెప్పిన ఈయన రెండు రోజులకే కన్నుమూయడం బాధాకరం. 

తనతో పాటు తన కుటుంబం కూడా ఈ సమయంలో ప్రైవసీని కోరుకుంటున్నామని.. అభిమానులకు మేమొక్కటే చెప్పదల్చుకున్నామని.. కరోనా మహమ్మారినుంచి తప్పించుకోవటానికి చాలా జాగ్రత్తగా ఉండండని ట్వీట్ చేసాడు జోయ్ జిఫ్ఫీ. అయితే ఇప్పుడు ఈయన మరణవార్త విని అంతా విషాదంలో మునిగిపోయారు. ఈయన అమెరికాలోని ఓకహోమలో జన్మించారు. వయసు 61 సంవత్సరాలు. 1990లలో ' పికప్‌ మ్యాన్‌' ప్రాప్‌ మి అప్‌ బిసైడ్‌ ది జ్యూక్‌ బాక్స్‌ వంటి చాలా హిట్‌ సాంగ్స్‌ను ఆయన స్వరపరిచారు. గ్రామీ అవార్డును కూడా ఆయన గెలుచుకున్నారు. జోయ్ డిఫ్ఫీ మృతితో హాలీవుడ్ లో విషాద చాయలు అలుముకున్నాయి. కరోనా బారిన పడి ఇంకెంత మంది చనిపోతారో అని భయపడుతున్నారు జనం. 

More Related Stories