హీరోయిన్లు బాధ్యత లేదా అంటున్న సీనియర్ నటుడు..actor
2020-04-01 03:29:36

ఇప్పటి వరకు విరాళం కేవలం హీరోలు మాత్రమే ఇస్తున్నారు. దర్శకులు, నిర్మాతలు కూడా ప్రకటిస్తున్నారు. అయితే విచిత్రంగా ఒక్కరంటే ఒక్క హీరోయిన్ కూడా ప్రకటించకపోవడం నిజంగానే విడ్డూరంగా అనిపిస్తుంది. కోట్లకు కోట్లు పారితోషికం ముక్కు పిండి మరీ తీసుకునే హీరోయిన్లకు ఇప్పుడు సాయం చేయాల్సిన బాధ్యత లేదా అని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు బ్రహ్మాజీ కూడా ఇదే అడుగుతున్నాడు. కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం తన వంతుగా ఈయన 75 వేల రూపాయల సాయం అందించాడు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రస్తుతం సినీ కార్మికులు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే కన్నీరొస్తుంది.. వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. ఇలాంటి సమయంలో కనీస అవసరాలకు కూడా డబ్బులు లేని వాళ్లకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ సీసీసీని ఏర్పాటు చేసినట్లు చెప్పాడు బ్రహ్మాజీ. ఇదిలా ఉంటే విరాళం విషయంపై కూడా మాట్లాడాడు ఈయన. ఈ సమయంలో కేవలం హీరోలు మాత్రమే విరాళాలు ఇస్తున్నారు. మరి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు ఎందుకు ఇవ్వడం లేదు.. హీరోయిన్స్ సినీ కార్మికుల విషయంలో బాధ్యత లేదా అంటూ బ్రహ్మాజీ ప్రశ్నించాడు. లావణ్య త్రిపాఠి, ప్రణీత మాత్రమే ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోయిన్స్ లో విరాళం ప్రకటించారు. మిగిలిన వాళ్లు కూడా విరాళం ఇవ్వాలంటూ ఆయన కోరుతున్నాడు. కారెక్టర్ ఆర్టిస్టులు కూడా కొందరు భారీగానే అందుకుంటున్నారు. వాళ్లు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పాడు బ్రహ్మాజీ.

More Related Stories