కేరీర్ లోనే మొదటి సారి ఆ తరహా పాత్రలో చరణ్ Ram charan
2020-04-02 19:19:36

తెలుగులో అసలు ఫ్లాప్ లే లేని డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఒక్కరు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈయన వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూ సినిమాలు ఐదూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి వెంకటేష్, వరుణ్ తేజ్ , రవితేజ లతో ఎఫ్ 2 సిక్వెల్ ఎఫ్ 3 ప్లాన్ చేస్తున్నాడనే ప్రచారం జరిగింది. అది కాక మహేష్ కబురు పెడితే ఆయన దగ్గరకు వెళ్లి ఇప్పుడేమి ఆయనతో సినిమా చేయలేనని చెప్పి వచ్చాడని కూడా ప్రచారం జరిగింది. 

అయితే బాలయ్య కబురు పెట్టాడని ఆయనతో ఒక సినిమా చేస్తానని చెప్పాడని అంటున్నారు. అయితే అనిల్ ఇటీవలే రామ్ చరణ్ ను కలసి కథ వినిపించాడట. కథ నచ్చడంతో వెంటనే పూర్తి కథను సిద్ధం చేయమని చెప్పాడట రామ్ చరణ్. ఇక ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తారని హీరోయిన్‌గా కియారాను తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే కెరీర్‌లో మొదటిసారి రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ కామెడీని పండించే పాత్రలో నటించబోతున్నాడట. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యాక అనిల్ రావిపూడి సినిమా చేయనున్నాడట చరణ్.

More Related Stories