ఆ నటుడు ఇండస్ట్రీకి రాకముందు వాచ్ మెన్ గా చేసాడంట..Sayaji Shinde
2020-04-02 13:25:03

కొందరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్టార్స్ అవుతారు. కానీ మొదట్నుంచి నుంచి వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుందేమో అనుకోవడం మాత్రం నిజంగానే భ్రమ. ఎందుకంటే సినిమాల్లోకి రాకముందు చాలామంది అష్ట కష్టాలు పడుతుంటారు. కొందరికి తినడానికి తిండి కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి సూపర్ స్టార్స్ అవుతారు. ఇక ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా తన గతం గురించి చెప్పుకున్నాడు. సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన మూడేళ్ల పాటు ఒక కాలేజ్ వాచ్ మెన్ గా పని చేశానని చెప్పాడు. అతను ఎవరో కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన సాయాజీ షిండే. పేరుకు మరాటి నటుడు అయినా కూడా తెలుగులో తన డబ్బింగ్ తానే చెప్పుకుంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు షిండే. 

ఠాగూర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన.. ఆ తర్వాత 50 సినిమాలకు పైగా నటించాడు. అందులో 90 శాతం సినిమాల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకొన్నాడు. తెలుగు భాష కాకపోయినా కూడా నేర్చుకొని మరి డబ్బింగ్ చెప్పాడు షిండే. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో తన పర్సనల్ విషయాల గురించి బయట పెట్టాడు. తాను మహారాష్ట్రలో పుట్టానని.. తనది చాలా పేద కుటుంబం అని చెప్పాడు సాయాజీ షిండే. తన ఊర్లో ఏడో తరగతి వరకు చదువుకున్న తర్వాత పక్క ఊరికి వెళ్లి టెన్త్ కంప్లీట్ చేసి ఆ తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యానని.. అక్కడ ఫీజు కోసం అదే కాలేజీలో మూడేళ్లపాటు వాచ్ మెన్ గా చేశానని చెప్పాడు షిండే. 

పగలు చదువుకోవడం రాత్రి అదే కాలేజీలో వాచ్ మెన్ గా ఉండటం.. ఆ వచ్చిన డబ్బులతో ఫీజ్ పట్టుకోవడంతో పాటు తన నెలసరి ఖర్చులు చూసుకునేవాడినని చెప్పాడు ఈయన. ఆ తర్వాత 1978, 79 ప్రాంతంలో నాటకాల వైపు వెళ్లానని.. అక్కడి నుంచి సినిమాల వైపు తన ప్రయాణం సాగిందని చెప్పాడు. మరాఠీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న షాయాజీ షిండే ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా భాషల్లో నటించి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు. 
 

More Related Stories