అగ్ర హీరోలకు శ్రీయ ఛాలెంజ్.. అందమైన భార్యల కోసం ఆ పని చేయాలట Shriya Saran
2020-04-03 22:46:40

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించిన శ్రీయ తన నటనతో మరియు అందంతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇండస్ట్రీ లో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈ భామ ఇప్పటికి డిమాండ్  మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ  తెలుగు హిందీ భాషల్లో పలు ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పి బిజీగా ఉంది. శివాజీ, ఛత్రపతి సినిమాలతో ఈ ముద్దు గుమ్మ అభిమానుల సంఖ్యను ఒక రేంజ్ లో పెంచుకుంది.ఇదిలా ఉండగా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో షూటింగ్ లు లేకపోవడంతో తారలంతా ఇంటికే పరిమితమయ్యారు. కొందరు భామలు హాట్ ఫొటోలతో అభిమానులను కూల్ చేస్తుంటే శ్రీయ మాత్రం అందుకు బిన్నంగా అగ్ర హీరోలకే అంట్లు తోమే ఛాలెంజ్ ను విసిరింది. 

ఈ భామ 2018లో ఓ బార్సిలోనా ఫుట్ బాల్ ప్లేయర్ ఆండ్రీ కొచ్చిన్ ను పెళ్లి చేసుకుంది. ఇంట్లో ఉండి గిన్నెలు తోమాల్సి వచ్చిందో ఏమో గాని తనకు గిన్నెలు తోమడం అంటే ఇష్టం ఉండదని అందుకే హీరోలు తమ అందమైన భార్యల కోసం అంట్లు తోమాలని ఛాలెంజ్ విసిరింది. "బార్తన్‌ సాఫ్‌ కరో" అంటూ ఛాలెంజ్ చేస్తూ తెలుగులో అల్లు అర్జున్ మరియు తమిళ నటుడు ఆర్య కు టాగ్ చేసింది. దీంతో ఆమె పోస్ట్ పై నెటిజన్లు ఫన్నీ గా కామెంట్లు చేస్తున్నారు.   


 

More Related Stories