ఆత్మకథ రాస్తున్న మెగాస్టార్..chiru
2020-04-06 00:39:29

సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరు  రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ ప్రస్తుతం కేవలం సినిమాల పైనే దృష్టి పెట్టి అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. చిరు కేవలం సినిమాలే కాకుండా ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో అడుగు పెట్టి తన అభిమానులకు మరింత దగ్గరయ్యారు. కాగా ఈ లాక్ డౌన్ పీరియడ్ ను సెలెబ్రిటీ లు ఒక్కక్కరు ఒక్కో విధంగా ఉపయోగించుకుంటున్నారు. కొందరు వంట గదుల్లో బిజీ కాగా మరి కొందరు వ్యాయామం చేస్తూ తమ ఫిట్నెస్ ను పెంచుకునే పనిలో ఉన్నారు.

ఇదిలా ఉండగా మెగాస్టార్ తన ఆత్మకథను విడుదల చేస్తానని ఇదివరకే పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో చిరు తన ఆత్మకథను రాసే పనిలో పడ్డారట. ఈ విషయాన్ని చిరంజీవి గారే ఒక పత్రిక తీసుకున్న ఇంటర్వ్యూ లో చెప్పారు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను వీడియో రూపంలో భద్రపరుచుకున్నానని. వాటిని ఇప్పుడు పుస్తక రూపం లోకి తెస్తున్నానని తెలిపారు. అంటే చిరు తన ఆత్మకథను పుస్తకం తో పాటు వీడియో రూపంలో కూడా విడుదల చేయనున్నారు. కాగా చిరు త్వరలోనే తన ఆత్మకథను పూర్తిచేసి విడుదల చేసే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా కాళీ సమయాల్లో అప్పుడప్పుడు వంట గదిలోకి వెళ్లి దోసెలు కూడా వేస్తున్నారట. దానితోపాటు వ్యాయామం, చెట్లకు నీళ్లు పోయడం చేస్తున్నారట.

 

More Related Stories