సంక్రాంతికా అనిల్ రావిపూడి.. రాజమౌళి ఉన్నాడు చూస్కో.. Anil Ravipudi
2020-04-07 01:38:10

కొత్తల్లుడు వచ్చినట్లు ప్రతీ సంక్రాంతికి ఓ సినిమాతో వచ్చి విజయం అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. గతేడాది ఎఫ్ 2.. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాలతో సంక్రాంతి విజయాలు అందుకున్న ఈ దర్శకుడు.. 2021 సంక్రాంతికి కూడా వస్తానంటున్నాడు. సినిమాలు చాలా వేగంగా పూర్తి చేస్తాడనే పేరు ఈ దర్శకుడికి ఉంది. మరీ ముఖ్యంగా మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాను కేవలం 5 నెలల్లోనే పూర్తి చేసాడు. ఇప్పుడు అదే స్పీడ్ తో ఎఫ్ 3 చేయాలని చూస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండి స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసాడు ఈయన. ఎఫ్3 ప్రస్తుతం పట్టాలెక్కడానికి రెడీగా ఉంది. 

ఒక్కసారి లాక్ డౌన్ పూర్తైతే అస్సలు ఆగేది లేదంటున్నాడు ఈయన. ఇందులో వెంకటేష్ నటిస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆయన డబుల్ రెమ్యునరేషన్ అడగడంతో ఆలోచనలో పడిపోయారు దిల్ రాజు, అనిల్ రావిపూడి. ఇదిలా ఉంటే సంక్రాంతికి వస్తానంటున్నాడు కానీ అప్పుడు రాజమౌళి ఉన్నాడనే సంగతి మరిచిపోయాడేమో ఈ కుర్ర దర్శకుడు. ఎందుకంటే జనవరి 8న RRR రిలీజ్ కాబోతుంది. ఒకవేళ అది డేట్ మారితే అనిల్ పండగ చేసుకోవడం ఖాయం. ఎందుకంటే ఈయన సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఖాయం. 

More Related Stories