అల్లు అర్జున్ తర్వాత యాంకర్ ప్రదీప్‌కు ఆ రికార్డ్ సొంతం.. Neeli Neeli Aakasam song
2020-04-07 14:36:06

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కూడా ఒకడు. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ కుర్ర యాంకర్ ప్రస్తుతం హీరో కూడా అయ్యాడు. ఈయన నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా విడుదలకు సిద్ధంగా ఉంది. దాంతో పాటే ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాడు. ఇది ఇదే అది అదే అంటున్నాడు ఈయన. ఈయన హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమాపై అంచనాలు పెరిగిపోవడానికి ఒకేఒక్క కారణం అందులో ఉన్న పాట. నీలినీలి ఆకాశం అంటూ సాగే ఈ పాట సంచలనం రేపింది. ఎవరి నోట్లో విన్నా కూడా ఇదే పాట వినిపించింది. అంతగా రచ్చ చేసాడు ప్రదీప్. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. 

విడుదలైన రోజు నుంచి కూడా ఈ పాట సంచలనం సృష్టించింది. ముఖ్యంగా యూ ట్యూబ్ లో కూడా దుమ్ము దులిపేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ పాట మరో రికార్డుకు తెరతీసింది. అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తైపోయింది. కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. నీలినీలి ఆకాశం పాటకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో పాటలతో మూడుసార్లు 100 మిలియన్ అందుకున్నాడు. సామజవరగమనాతో పాటు రాములో రాములా, బుట్టబొమ్మ పాటలకు కూడా 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు నీలినీలి ఆకాశం కూడా ఇదే రికార్డు సొంతం చేసుకుంది. ప్రదీప్ లాంటి యాంకర్ పాటకు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం కూడా నిజంగానే అద్భుతం. 

More Related Stories