మాళవిక పాప చాలా హాట్‌గా ఉంది మాస్టర్..malavika
2020-04-07 19:21:00

మాళవిక మోహనన్.. ప్రస్తుతం ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ రాసి పెట్టుకోండి మరో రెండు నెలల్లో కచ్చితంగా ఈమె పేరు సౌత్ లో మార్మోగిపోవడం ఖాయం. ఇప్పటికే ఈమె గురించి తమిళ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. అసలు ఎవరు ఈ మాళవిక.. ఎక్కడి నుంచి వచ్చింది.. ఉన్నట్టుండి దళపతి విజయ్ సినిమాలో హీరోయిన్ గా ఎలా అయింది అంటూ అందరూ ఆరా తీస్తున్నారు. విషయం ఏంటంటే దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న మాస్టర్ సినిమాలో ఈమె హీరోయిన్. నిన్నటి వరకు కూడా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది క్లారిటీ లేదు. అయితే ఉన్నట్లుండి మాళవికా మోహనన్ ఉన్న ఫోటోను విడుదల చేశారు చిత్రయూనిట్. గతేడాది కార్తీతో ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక నటిస్తుందని తెలియడంతో ఒక్కసారిగా తమిళ ఇండస్ట్రీలో ఈమె గురించి చర్చ మొదలైంది. ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి చెక్ చేస్తే సినిమా కుటుంబం నుంచి వచ్చిందని  తెలిసింది. ఈమె తండ్రి కేయూ మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్. సాధారణంగా ఇండస్ట్రీలోకి హీరోలు దర్శకులు నిర్మాతలు వారసురాళ్ళు వస్తుంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా సినిమాటోగ్రాఫర్ కూతురు హీరోయిన్ అయింది.

మాళవిక మోహనన్ పేరు ప్రస్తుతం తమిళనాట ట్రెండింగ్ గా మారిపోయింది. విజయ్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో నటించడంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. రేపు మాస్టర్ సినిమా సూపర్ హిట్ అయితే దెబ్బకు సూపర్ స్టార్ అయిపోతుంది మాళవికా మోహనన్. మాస్టర్ సినిమాకు ముందు ఒకట్రెండు హిందీ తమిళంలో చేసినా పాపులర్ కాలేదు. కానీ మాస్టర్ సినిమాలో తన పోస్టర్ రిలీజ్ చేసేసరికి మాళవిక మోహనన్ ఆనందానికి అవధులు లేవు. దానికి తోడు విజయ్, విజయ్ సేతుపతి ఇలాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ భామ గాల్లో తేలిపోతుంది. మాస్టర్ విడుదలైన తర్వాత కచ్చితంగా మాళవికా మోహనన్ కెరీర్ మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. మాస్టర్ లో చాలా పద్దతిగా కనిపించింది కానీ ఇప్పుడు విడుదలైన ఫోటోలు చూస్తుంటే మాత్రం పాప చాలా హాట్ మాస్టర్ అనక తప్పదేమో..? అంతగా క్లీవేజ్ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంది మాళవిక.

More Related Stories