పవన్ కి ఆ మల్టీస్టారర్ వర్కౌట్ అవుతుందా  Pawan Kalyan Ravi Teja
2020-04-08 20:04:06

త‌మిళ్ బ్లాక్ బ‌స్టర్ విక్రమ్ వేద‌ 2017లో విడుదలై బ్లాక్ బాస్టర్ల లిస్టులో ఒకటిగా చేరింది. మాధవన్ , విజయ్ సేతుపతి కలిసి నటించిన విక్రమ్ వేద యాక్షన్ థ్రిల్లర్ గా మంచి మార్కులే కొట్టేసింది. థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాని పుష్కర్ – గాయత్రి తెరక్కించగా 100కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాని తెలుగులో తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు చాన్నాళ్ళ నుండి అంటే గత ఏడాది మొదట నుండీ ప్రచారం జరుగుతోంది. అప్పట్లో కొన్ని వెబ్ సైట్లు ఈ రీమేక్ లో విక్టరీ వెంకటేష్ , నారా రోహిత్ హీరోలుగా నటించనున్నారని మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని కధనాలు వండి వార్చాయి. అయితే అప్పట్లో అదేం లేదని సురేష్ ప్రొడక్షన్స్ క్లారిటీ కూడా ఇచ్చింది. 

అయితే ఈ మధ్య మళ్ళీ ఒక ప్రచారం జరిగింది అదేంటంటే ఈ మూవీని తెలుగులో నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించాలని ప్రయత్నిస్తున్నారని తనకి సన్నిహితులుగా ఉన్న పవన్, రవి తేజలను ఆ సినిమాలో నటింప చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉన్నదో తెలియదు కానీ కొద్దిరోజులుగా ఈ వార్త అయితే టాలీవుడ్ లో తెగ తిరుగుతోంది. తమిళ్ లో విజయ్ సేతుపతి చేసిన స్మగ్లర్ రోల్ పవన్ తో, మాధవన్ చేసిన పోలీస్ రోల్ రవితేజతో చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. 

రామ్ తాళ్లూరి పవన్ కి సన్నిహితుడు కాబట్టి పవన్ ని సినిమా కోసం ఒప్పించడం పెద్ద విషయం ఏమీ కాదు. అయితే కధలు కన్నా ఎలివేషన్స్ కే ఎక్కువ విలువ ఇచ్చే మన టాలీవుడ్ లో పవన్ ఈ పాత్ర చేసినా అది వర్కౌట్ అవుతుందా ? అనేది అనుమానమే. మరి పవన్ ఈ పాత్ర ఒప్పుకున్నా, ఆయనకు సెట్ అవదని కూడా కొందరు అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో ?

More Related Stories