కత్రినా కైఫ్ కాదు.. కత్తి లాంటి కైఫ్.. సోకుల నైఫ్..kaif
2020-04-09 03:27:02

కత్రినా కైఫ్ అని పేరెవరు పెట్టారో కానీ చూస్తుంటే నిజంగానే కత్తి లాంటి సోకులతో ప్రాణాలు తీస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ పేరుకే బాలీవుడ్‌లో ఓ హిస్ట‌రీ ఉంది. స‌ల్మాన్ ఖాన్, ర‌ణ్ బీర్ క‌పూర్ లాంటి స్టార్ హీరోల‌తో ప్రేమాయ‌ణం న‌డిపి సూప‌ర్ స్టార్ ఇమేజ్ కొట్టేసింది క‌త్రినా. లండ‌న్ నుంచి ఇంపోర్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ‌కు బాలీవుడ్ బాగానే అవ‌కాశాలిచ్చి నెత్తిన పెట్టుకుంది. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు ఇదిగో ఇలా హాట్ ఫోటోషూట్ ల‌తో ప్రేక్ష‌కుల గుండెలు గ‌ల్లంతు చేస్తోంది క‌త్రినాకైఫ్. మొహమాటం అనే ప‌దం క‌త్రినా డిక్ష‌న‌రీలోనే లేదు. అందాల ఆర‌బోత‌లో ఈ భామ పిహెచ్ డీ పూర్తిచేసింది ఈ భామ‌. ఎంత కావాలంటే అంత‌.. రెడీ అంటూ రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ‌. మొన్నటికి మొన్న బికినీ ఫోటోషూట్ లో రెచ్చిపోయిన క్యాట్స్.. మ‌ళ్లీ ఇప్పుడు ఇంకో హాట్ షోతో ప్రేక్ష‌కుల మ‌తులు పోగొడుతుంది. కొత్త హీరోయిన్ల ధాటికి.. దీపిక జోరుకు ఎప్పుడో క‌త్రినా సైలెంట్ అయిపోయింది. కానీ ఇన్నేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ ఏ దేవుడో క‌రుణించిన‌ట్లున్నాడు. అందుకే క‌త్రినాకు వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ మధ్యే వరసగా షారుక్, సల్మాన్, అమీర్ సినిమాల్లో నటించింది కత్రినా. కానీ ఈ ముగ్గురుతో నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, భారత్, జీరో సినిమాలు ఫ్లాప్ కావడంతో అవకాశాలకు దూరంగా ఉండిపోయింది ఈ భామ. దాంతో చేసేదేం లేక ఇప్పుడు ఇలా అందాలను ఆరబోస్తుంది కత్రినా. ఇప్పుడు విడుదలైన స్టిల్స్ కూడా అమ్మడిలోని హాట్ నెస్ ఏంటో చూపిస్తున్నాయి. రెచ్చిపోయి రచ్చ చేస్తున్న కత్రినాను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు. మరి కనీసం ఇదైనా మళ్లీ అమ్మడికి ఆఫర్లు తీసుకొస్తుందో లేదో చూడాలి.

 

More Related Stories