ఏజ్‌తో పనేంటి.. రొమాన్స్ ముఖ్యమంటున్న హీరోలు..  tollywood
2020-04-10 02:19:55

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్లు దొరకడం కష్టమైపోయింది. వాళ్ల వయసులో సగానికి సగం ఉన్న హీరోయిన్లతో ఆడిపాడుతున్నారు మన హీరోలు. ముఖ్యంగా నలుగురు సీనియర్ హీరోలకు అయితే ఇప్పుడు జోడీ వెతకడం కష్టమే అవుతుంది. ఎప్పుడూ తమకంటే చిన్న వాళ్లతోనే రొమాన్స్ చేయడం మన హీరోలకు తెలుసు.. కానీ ఇప్పుడు కాస్త భిన్నంగా తమ కంటే వయసులో పెద్ద వాళ్లైన హీరోయిన్లతోనూ మన హీరోలు ఆడిపాడుతున్నారు.. ఘాటు రొమాన్స్ కూడా చేస్తున్నారు. ఈ మధ్య అదే ట్రెండ్ అయిపోతుంది. కథ డిమాండ్ చేస్తే క్యారెక్టర్‌కి ఆ ఇద్దరూ న్యాయం చేస్తారనుకుంటే వయసులో తక్కువ ఉన్న హీరోలతో కూడా మన హీరోయిన్లు నటించడానికి సై అంటున్నారు. 

ఒకప్పుడు ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో హీరోయిన్లు ఆయన కంటే ఎక్కువ వయసున్న వాళ్లే. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ తో నటించిన భూమికకు అప్పుడు వయసు 25 సంవత్సరాలు అయితే.. ఎన్టీఆర్ వయసు కేవలం 19 మాత్రమే.. ఆ తర్వాత కూడా సాంబలో కలిసి నటించారు ఈ ఇద్దరు. వాళ్లే కాదు.. మరికొందరు హీరోయిన్లకు కూడా ఎన్టీఆర్ తో ఏజ్ గ్యాప్ ఉంది. ఇక మహేష్ బాబు వంశీలో నమ్రతతో జోడీ కట్టినపుడు ఆయన కంటే ఆమె మూడేళ్లు పెద్దది.. అయినా రియల్ లైఫ్ లో కూడా కపుల్ అయిపోయారు ఈ ఇద్దరు. 

రామ్ చరణ్ కూడా తనకంటే మూడేళ్లు పెద్దదైన ప్రియాంక చోప్రాతో జంజీర్ సినిమాలో నటించాడు. హీరో రామ్ తన తొలి సినిమా దేవదాసులో తన కంటే మూడేళ్ల పెద్దదైన ఇలియానాతో రొమాన్స్ చేసాడు. బెల్లంకొండ శ్రీనివాస్ అయితే తనకంటే చాలా పెద్ద హీరోయిన్లతో నటిస్తున్నాడు.. ఈయన కంటే సమంత ఆరేళ్లు వయసులో పెద్దది.. అయినా అల్లుడు శ్రీనులో నటించారు. ఇక కాజల్, మెహ్రీన్, తమన్నా కూడా పెద్ద వాళ్లే. శర్వానంద్ కూడా తనకంటే పెద్ద హీరోయిన్లతో నటించాడు. మొత్తానికి హీరోలకు వయసుతో సంబంధం లేదు.. రొమాన్స్ కుదిర్తే చాలు అంటున్నారిప్పుడు. 

More Related Stories