మసక్కలిని నాశనం చేసారు.. రెహమాన్ భావోద్వేగం..



rehman
2020-04-10 02:34:25

బాలీవుడ్ లో రీమిక్స్ సాంగ్స్ హవా చాలా రోజుల నుంచి నడుస్తుంది. అయితే కొన్ని పాటలు మాత్రం అనవసరంగా నాశనం చేస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. ఆ మధ్య బొంబాయి సినిమాలోని ఓ పాటను తన సినిమా కోసం మళ్లీ రీమిక్స్ చేసుకున్నాడు మణిరత్నం. హమ్మ హమ్మ పాటకు అంత మంచి రెస్పాన్స్ రాలేదు. దాంతో పాటు మరికొన్ని పాటలు కూడా అనవసరంగా చెడగొడుతున్నారంటూ అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మసక్కలి 2.0 అంటూ ఓ పాట విడుదలైంది. అప్పట్లో ఢిల్లీ 6 సినిమా కోసం ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాట సంచలనం అయింది. చాలా పెద్ద హిట్ అయింది ఈ పాట. సినిమా ఫ్లాప్ అయినా కూడా పాట మాత్రం గుర్తుండిపోయింది. అలాంటి చార్ట్ బస్టర్ సాంగ్ ను ఇప్పుడు సిద్దార్థ్‌ మల్హోత్రా , తారా సుతారియాపై మసక్కలి 2.0 పాటను విడుదల చేసారు.

కొత్త వర్షన్‌ కు తనీష్‌ బాగ్చి స్వరాలు అందించారు. ఈ పాటను అనవసరంగా నాశనం చేసారంటూ మండి పడుతున్నారు అభిమానులు. ఇప్పుడు రెహమాన్ కూడా ఇదే రకంగా స్పందించాడు. తన పాటను నాశనం చేసారని చెప్పకుండా.. ఒక్కసారి ఒరిజినల్ వినండి అంటూ సెటైర్ వేసాడు. ట్వీట్ కూడా చేసాడు ఈయన. ఈ పాట కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను గడపాల్సి వచ్చిందని.. చాలా సార్లు మార్చి ట్యూన్ చేసామని.. దాదాపు 200 మంది సంగీత కారులు పని చేసారని గుర్తు చేసుకున్నాడు రెహమాన్. అందుకే ఒక్కసారి ఒరిజినల్ మసక్కలి పాటను విని సంతోషించండంటూ ట్వీట్ చేసాడు రెహమాన్. ఈ లెక్కన ఒరిజినల్ ను నాశనం చేసారని ఆయన ఫీల్ అయినట్లు అర్థమవుతుంది. నెటిజన్లు కూడా అనవసరంగా ఈ పాటను ఎందుకు రీమిక్స్ చేసారంటూ ప్రశ్నిస్తున్నారు.

More Related Stories