తిండి లేని వారికీ అన్నదానం చేసి విమర్శలపాలయిన హీరో శ్రీకాంత్ Hero Srikanth
2020-04-11 12:13:23

ఒక్కోసారి మంచి పని చేసినా తిట్లు తినాల్సి వస్తుంది, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలాగే ఉంది హీరో శ్రీకాంత్ పరిస్థితి. కరోనా కారణంగా విధించబడ్డ లాక్ డౌన్ లో ఉన్న ప్రజలలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు ఆకలి బాధలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా రోజు కూలికి వెళితే కానీ ఇల్లు గడవని వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే రోజువారి బేటాల మీదనే బ్రతికే సినిమా కార్మికులపై ఈ ఎఫెక్ట్ పడింది .రోజు షూటింగ్ కి వెళ్తే కాని పూటగడవని స్థితిలో ఎంతో మంది సినీ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ సీసిసీ సాయం ఆదుకోవడానికి అర్హులో కాదో తెలీదు, ఎందుకంటే ఆ సీసిసీ తరపున కేవలం కార్డులు ఉండి, యూనియన్స్ లో ఉన్నవారే ఉంటున్నారు. ఇప్పుడు కార్డులు లేని వారు లాక్ డౌన్ కారణంగా ఆకలి బాధలు అనుభావిస్తున్నారు. 

ఈ నేపధ్యంలో శ్రీకాంత్ సినిమా రంగమా కాదా అనేది కూడా చూడకుండా అన్నదానం కార్యక్రమం చేపట్టారు. లాక్ డౌన్ కారణంగా బీహార్, ఒరిస్సా ప్రాంతాల కూలీలు ఇక్కడ పనులకు వచ్చి ఇరుక్కు పోయారు. వారందరికీ నిన్న చిత్రపూరి కాలనీ వద్ద అన్నదానం చేశారు. అయితే అది పూర్తి అయ్యాక దానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలతో, తన అభిమానులతో పంచుకున్నారు. ఇదే ఆయన మీద నెగటివ్ కామెంట్స్ కి కారణం అయ్యింది. ఎందుకంటే ఈ అన్నదాన కార్యక్రమానికి ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. దీంతో ఎవరిని తప్పు పడదామా ? అని ఆన్ లైన్ లో రెడీగా ఉండే బ్యాచ్, ఈ లాక్ డౌన్ సమయంలో బ్యానర్ బాగా కొట్టించారు ? మీకు పబ్లిసిటీ పిచ్చి అందుకే లాక్ డౌన్ సమయంలో కూడా బ్యానర్ కొట్టించి అన్నదానం చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే శ్రీకాంత్ చేసిన పనికి ప్రసంశలు కూడా దక్కుకుతున్నాయి.
 

More Related Stories