కార్మికుల దినోత్సవం రోజే అల వైకుంఠపురములో.. అలా టీవీలో.. Ala Vaikunthapurramuloo
2020-04-11 16:46:56

వచ్చేసింది.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేచి చూస్తున్న మూవెంట్ వచ్చేసింది. ప్రస్తుతం బన్నీ ఇండియన్ వైడ్ గా ట్రెండింగ్ అవుతున్నాడు. ఈయన పుట్టిన రోజు కానుకగా విడుదలైన సుకుమార్ పుష్ప ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ లుక్ చూసి అంతా షాక్ అయిపోయారు. రంగస్థలంలో చరణ్ కంటే ఈ లుక్ ఇంకా బాగుంది అంటూ బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా నటిస్తున్నాడు అల్లు అర్జున్. దాంతో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తుంది ఈ చిత్రం. ఈ సినిమాలో బన్నీ కాలుకు ఆరు వేళ్లున్నాయి. పోస్టర్ లో చాలా విషయాలు చెప్పాడు సుకుమార్. 

ఇదిలా ఉంటే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠపురములో సినిమాను టీవీలో ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారంటూ అడుగుతున్నారు బన్నీ ఫ్యాన్స్. నిజానికి ఎప్రిల్ 8న ఈయన పుట్టిన రోజు కాబట్టి ఇదే వీకెండ్ చేసుంటే బాగుండేదని వాళ్లు కోరుకున్నారు కానీ జెమిని మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికే జెమినీ తన వీకెండ్ సినిమాలన్నింటినీ ఫిక్స్ చేసుకున్నారు. అందులో దర్బార్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అందుకే అల వైకుంఠపురములోను మే 1కి షిఫ్ట్ చేసారు. 

తాజాగా ప్రోమోలు కూడా వేస్తున్నారు. కార్మికుల దినోత్సవం రోజే మే 1న అల వైకుంఠపురములో అలా వచ్చేస్తుంది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు ఉగాదికి వేసారు.. దానికి 23.4 రికార్డ్ రేటింగ్ వచ్చింది. దాన్నిప్పుడు బన్నీ తిరగరాయాలని చూస్తున్నాడు. 

More Related Stories