అన్నతోనే కాదు తమ్ముడితో కూడాkajal
2020-04-12 18:36:18

ఒకరకంగా ఒక స్పష్టమయిన ఎన్నాళ్ళ నుండో జరుగుతున్న పెద్ద ప్రచారానికి తెర దింపింది కాజల్ అగర్వాల్. విషయం ఏమిటంటే చిరంజీవి-కొరటాల సినిమాలో హీరోయిన్ గా ఎంపికయిన త్రిష ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేసిన నేపధ్యంలో ఆ సినిమాలో నటించాబోయేది తానే నంటూ ఆమె క్లారిటీ ఇచ్చేసింది. సినిమా యూనిట్ నుండి ఎటువంటి కన్ఫర్మేషన్ లేకున్నా తన ఇన్స్టా ఫాలోవర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆ క్లారిటీ ఇచ్చింది కాజల్. అయితే అన్నతోపాటు తమ్ముడితో కూడా ఆమె నటించనున్నట్టు చెబుతున్నారు. నిజానికి పవన్‌ కల్యాణ్ తో కాజల్‌ అగర్వాల్‌ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమాలో నటించింది. ఇప్పుడు ఈ జంట మరోసారి కనువిందు చేయబోతుందని చెబుతున్నారు. పవన్ హీరోగా మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ ఒక సినిమా నిర్మిస్తోంది. హరీష్ శంకర్ తెరకెక్కించే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉందట. అందులో ప్రధాన నాయికగా కాజల్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. కాజల్‌ అయితే ఈ పాత్రకు సరిపోతుందని, అందుకే ఆమెకు కథ కూడా హరీష్ వినిపించారని టాక్‌. 

More Related Stories