క్రేజీ కాంబో మీద అంచనాలు...గట్టిగానే కష్టపడుతున్నాడట !devi
2020-04-12 22:57:00

దేవి శ్రీ ప్రసాద్ - సుకుమార్ కాంబినేషన్ అంటేనే ఒకరకంగా ఫీస్ట్ అని చెప్పచ్చు. వారి కలయికలో వచ్చిన అన్ని సినిమాలలోని ఐటెం సాంగ్స్ ఇప్పటికీ జనాల నోట ఏదో ఒక సమయంలో నానుతూనే ఉంటాయి. ఒక్క ‘నాన్నకు ప్రేమతో మినహాయిస్తే వీరి కాంబోలో వచ్చిన ప్రతీ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముందుగా ఆర్యలో అ అంటే అమ‌లాపురం, జ‌గ‌డంలో 36,26,36, ఆర్య2లో రింగ రింగ , 100% ల‌వ్ లో డియ్యాలో డియ్యాలా, నేనొక్కడినేలో లండ‌న్ బాబు, రంగ‌స్థలంలో జిగేల్ రాణి ఇలా ప్రతీ ఐటెం నెంబర్ జనాల్లోకి బాగా వెళ్ళింది. ఇప్పుడు సుక్కు, డీఎస్పీ కాంబో లో వస్తున్న పుష్పలో కూడా ఐటమ్ సాంగ్‌ ని గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలకు సంబంధించి రెండు ట్యూన్స్ రెడీ చేశాడట డీఎస్పీ. అందులో ఒకటి టైటిల్ సాంగ్ కాగా.. మరొకటి ఐటమ్ సాంగ్ అని అంటున్నారు. ఈ సాంగ్ ని బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రుతేలాతో చేయిస్తారని అంటున్నారు. నిజానికి దేవి శ్రీ ప్రసాద్ పాటలు పెద్దగా హిట్ కావడం లేదు. సరిలేరు నీకెవ్వరుతో కొంచెం లైన్ లో పడినా ఈ సినిమాతో మళ్ళీ సత్తా చాటాలని చూస్తున్నాడు దేవి.  

 

More Related Stories