ర‌ష్మిక మంద‌న్న‌ను వేధించార‌ని వ‌చ్చిన మ‌హిళా సంఘాలు..rashmika
2020-04-13 07:02:43

హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌ను వేధించార‌ని ఇప్పుడు మ‌హిళా సంఘాలు బ‌య‌టికి వ‌చ్చాయి. అస‌లు త‌న‌నెప్పుడు వేధించారో తెలియ‌క పాపం ర‌ష్మిక కూడా క‌న్ఫ్యూజ‌న్ లోనే ఉంది. అయితే ఆ త‌ర్వాతే తెలిసింది ఆమెకు కూడా.. త‌ను వేధించింది బ‌య‌ట కాదు సినిమాలో అని. అవును న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. క‌న్న‌డ‌నాట పొగ‌రు అనే సినిమాలో న‌టించింది ర‌ష్మిక‌. అన్నీ బాగుండుంటే ఎప్రిల్ 24న ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉంది. కానీ క‌రోనా కార‌ణంగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఓ పాట వారం రోజుల కిందే విడుద‌లైంది. అందులో ర‌ష్మిక‌తో ఆడుకుంటాడు హీరో ధృవ స‌ర్జ‌. ఆమెను టీజ్ చేస్తూ పాట పాడ‌తాడు.. ఆ క్ర‌మంలోనే మీద చేయ్యేసి.. కాలేసి నానా ర‌చ్చ చేస్తాడు. ఇదంతా చూసిన మ‌హిళా సంఘాల‌కు ఓ అమ్మాయిని అలా టీజ్ చేస్తారా అంటూ మంట పుట్టుకొచ్చింది. సినిమాలో క‌థ ప్ర‌కార‌మే హీరో అలా చేస్తాడ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చెబుతున్నా కూడా వీళ్ల‌కు అర్థం కావ‌డం లేదు. అమ్మాయిని వేధించార‌ని వాళ్ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేసారు. వెంట‌నే పాట‌ను తీసేయ‌క‌పోతే సినిమాను విడుద‌ల కానివ్వ‌మంటూ వాళ్లు వార్నింగులు కూడా ఇస్తున్నారు. మ‌రి దీనిపై ద‌ర్శ‌కుడు నంద కిషోర్ ఏ నిర్ణ‌యం తీసుకుంటాడో చూడాలిక‌.

More Related Stories