అనూ ఆ సినిమాలో హీరోయిన్ కాదా Anu Emmanuel
2020-04-14 09:42:18

తెలుగులో కొందరు కధానాయికలు ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా పేరు రాదు. అలాంటి వారిని లిస్టు వేస్తే అందులో ముందు ఉంటుంది అను ఇమ్మానుయెల్. తెలుగులో అరడజను పైగా సినిమాలు చేసినా అన్నీ పెద్ద దెబ్బ కొట్టినవే. ఒక్క సీన్ లో నటించిన గీత గోవిందం బంపర్ హిట్ అయినా అది ఈవిడ లెక్కలోకి రాదు. అయితే ఈ భామ ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ హీరోగా న‌టిస్తున్న ‘అల్లుడు అదుర్స్‌’లో సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తోందని ప్రచారం జరిగింది. అయితే అది ప్రచారం కాదని నిజమేనని అంటున్నారు. 

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నభా నటేష్ కథానాయికగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ గా అను ఇమ్మాన్యూల్ ను సెలక్ట్ చేశారు. లాక్ డౌన్ తర్వాత మొదలయ్యే షెడ్యూల్ నుండి అను షూటింగ్ లో పాల్గొననుందని అంటున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే ఆమె హీరోయిన్ కాదట !. ఈ సినిమాలోనే అను విలన్ భార్య పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఆ పాత్రకు కూడా మంచి లెంగ్త్ పడడంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో ఆమె విలన్‌ పక్కన నటించేందుకు సిద్ధమైందని టాక్‌. మరి ఈ విలన్‌ ఎవరు? అనేది ఇప్పటికి క్లారిటీ లేదు.  

More Related Stories