ప్రభాస్ ఆయన సినిమాలో అతిథిగా కనిపించబోతున్నాడా..?prabhas
2020-04-16 13:51:46

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇప్పుడు కేవలం తెలుగు హీరో కాదు.. నేషనల్ హీరో. బాలీవుడ్ లో కూడా ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ కూడా ప్రభాస్ సినిమాలు విడుదలై సంచలనాలు రేపుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం అంటే చిన్న విషయం కాదు.. పైగా తనకంటే ఎన్నో రెట్లు ఇమేజ్ లో తక్కువగా ఉన్న హీరో సినిమాలో అతిథిగా మారడం అంటే మామూలు విషయం అస్సలే కాదు.. కానీ ఇప్పుడు ఇదే జరగబోతుందని ప్రచారం జరుగుతుంది. తన స్నేహితుడి కోసం అతిథి పాత్ర చేయడానికి ప్రభాస్ ఒప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంత పెద్ద ఫ్రెండ్ ఎవరున్నారబ్బా అనుకుంటున్నారా..? తెలుగులో ప్రభాస్ ప్రాణ స్నేహితుడు గోపీచంద్. వర్షం సినిమా సమయంలో ఈ ఇద్దరూ కలిసి నటించారు.. అందులో హీరో విలన్. అయితే ఆ సినిమా సమయం నుంచే ఇద్దరూ ప్రాణ స్నేహితులు అయిపోయారు. ఇక ఇఫ్పుడు వరస ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కెరీర్ కు తను అండగా ఉండాలని ఫిక్సైపోయాడు ఈయన. అందుకే తన నెక్ట్ సినిమాలో అతిథి పాత్ర చేస్తానని స్నేహితుడికి మాటిచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమా చేస్తున్నాడు ఈయన.

More Related Stories