ఇంద్రగంటి కథ ఫైనల్ చేసిన చైతూ...మహేష్ ఎఫెక్ట్ Indraganti chaitanya
2020-04-16 22:20:45

నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ కరోనా నేపధ్యంలో వాయిదా పడింది. ఆ విషయం పక్కన పెడితే నాగచైతన్య సినిమా లైనప్ ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటంటే నాగచైతన్య బంగార్రాజు షూటింగ్ మొదలవుతుంది. నాగార్జున హీరోగా నటిస్తున్న ఆ సినిమాలో చైతన్య ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది కాక గీతగోవిందం ఫేమ్ పరశురామ్ తో ఒక చిత్రం ప్రకటించాడు. అయితే ఇప్పుడు అతను మహేష్ తో సినిమా చేయాల్సి రావడంతో అది క్యాన్సిల్ అయినట్టే. అందుకే మనోడు ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పిన కధ ఓకె చేశాడట.

 

ఇంద్రగంటి ప్రస్తుతం నాని, సుధీర్ బాబు కాంబినేషన్ లో వీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 25న ఉగాది సందర్భంగా విడుదల కావాల్సి ఉన్నా కరోనా దెబ్బకు ఆగింది. ఈ లాక్ డౌన్ అంతా సద్దుమణిగాక దానిని రిలీజ్ చేస్తారు. అయితే చైతన్య కెరీర్ గ్రాప్గ్ ఇప్పుడు బాగుంది. మజిలీ పెద్ద హిట్ అలాగే వెంకీ మామ సినిమా కూడా బాక్స్ ఆఫీసు వద్ద బాగానే ఆడింది. ఇప్పుడు లవ్ స్టొరీ కూడా శేఖర్ కమ్ముల మార్క్ తో ఆడేయచ్చు, బంగార్రాజు ఎటూ సీక్వెల్ కాబట్టి హిట్ అయినా కాకున్నా కలెక్షన్స్ గట్టిగానే వస్తాయని అంటున్నారు. నిజానికి చైతూ రారండోయ్ వేడుక చేద్దాం అనే సినిమా చేస్తున్నప్పుడు ఇంద్రగంటి జెంటిల్మెన్ సినిమా చేసి ఖాళీగా ఉన్నాడు. అప్పుడే వీరిద్దరూ కలిసి సినిమా చేయాల్సింది. కానీ కుదర లేదు, మళ్ళీ ఇప్పుడు ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు.

More Related Stories