సందీప్ కిషన్ వచ్చి అప్పుడే పదేళ్లైపోయిందా..?sundeep
2020-04-17 02:45:39

కాలం చాలా వేగంగా వెళ్లిపోతుందంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. కళ్లు మూసి తెరిచేలోగా పదేళ్లు అయిపోయాయి. కుర్ర హీరో సందీప్ కిష‌న్ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే పదేళ్లైపోయింది. సందీప్ కిషన్ హీరోగా కాకుండా ప్రతినాయకుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు. ఆయన నటించిన తొలి సినిమా ప్రస్థానం 2010 ఏప్రిల్ 16న విడుదలైంది. దేవా కట్టా తెరకెక్కించిన ఈ చిత్రంలో శర్వానంద్ హీరో. ఇందులో సందీప్ పాత్రకు మంచి పేరొచ్చింది కూడా. పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన ప్రస్థానం సినిమాకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత గోవా ఇంటెర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించారు. 2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సందీప్ కిషన్ కి సోలో హీరోగా తొలి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసాడు కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. మధ్యలో తమిళనాడు వెళ్లి అక్కడ సక్సెస్ అయ్యాడు. వరస సినిమాలు కూడా చేసాడు. రెండు మూడు హిట్లు కూడా అందుకున్నాడు. తెలుగులో మాత్రం గతేడాది ఈయన నటించి నిర్మించిన నిను వీడని నీడను నేనే పర్లేదు అనిపించింది. మళ్లీ వెంటనే తెనాలి రామకృష్ణ అంటూ ఫ్లాప్ ఇచ్చాడు. ప్రస్తుతం హాకీ నేపథ్యంలో ఎ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. అలాగే రెండు తమిళ చిత్రాలు సందీప్ ఖాతాలో ఉన్నాయి. ఈ పదేళ్లు తన కెరీర్ లో చాలా నేర్పాయి అంటున్నాడు సందీప్ కిషన్.

More Related Stories