చరమాంకంలో కూడా అవకాశాలు వస్తున్నాయిగా.. Shriya
2020-04-18 00:19:21

ఏం చేస్తాం.. ఇండస్ట్రీలో కొంతమందికి లక్కు అలా రాసిపెట్టి ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీకి రోజుకో కొత్త హీరోయిన్ వస్తూనే ఉంది. అయినా కూడా ఇక్కడ హీరోయిన్ల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటికీ అదే పాత హీరోయిన్ల వెంట పడుతున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా సీనియర్ హీరోలకు జోడీని వెతకడానికి దర్శక నిర్మాతలకు తలప్రాణం తోకలోకి వస్తుంది. అందుకే వాళ్లకే మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు కొందరు హీరోయిన్లకు కలిసొస్తుంది. శ్రియ, త్రిష లాంటి హీరోయిన్ల కెరీర్ ఇప్పటికే ముగిసిన చరిత్ర. వీళ్ళ వైపు కుర్ర హీరోలు చూడటం ఎప్పుడో మానేసారు. కానీ సీనియర్ హీరోలకు మాత్రం ఇప్పటికీ వీళ్లే ఛాయిస్ అవుతున్నారు. దాంతో మరో ఆప్షన్ లేక వాళ్ల వైపు చూస్తున్నారు. 

శ్రియ పెళ్ళి చేసుకుని సెటిల్ అయిందని అంతా భావిస్తున్న సమయంలో ఇప్పుడు మళ్లీ కొందరు సీనియర్ హీరోలు ఈమె వైపు చూస్తున్నారు. ఇక ప్రియమణికి తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడు విక్టరీ వెంకటేష్. ఈయన నటిస్తున్న అసురన్ రీమేక్ లో ఆమెను హీరోయిన్ గా ఎంచుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఇక ఈమెతో పాటు త్రిష కూడా తమిళనాట వరస సినిమాలు చేస్తుంది. మొన్నటికి మొన్న చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చినా కూడా తప్పుకుంది. మణిరత్నం సినిమాలో అవకాశం రావడంతో చిరు సినిమాకు హ్యాండిచ్చింది త్రిష. 

తమన్నా పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. కాజల్ కూడా చిరంజీవితో రొమాన్స్ చేస్తుంది. దాంతో పాటే పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక బాలయ్య అయితే ఏరికోరి షెడ్డుకు వెళ్లిపోయిన హీరోయిన్లకే పిలిచి మరీ ఛాన్సులిస్తుంటాడు. ఇందులో ఇప్పుడు వేదిక కూడా అంతే. నాగార్జున కూడా రమ్యకృష్ణతో జోడీ కడుతున్నాడు. మొత్తానికి కెరీర్ క్లోజ్ అనుకుంటున్న సమయంలో వీళ్లకు పిలిచి అవకాశాలిస్తున్నారు మన స్టార్ హీరోలు. 

More Related Stories