విడాకులు తీసుకున్న టాలీవుడ్ టాప్ యాంకర్.. Tollywood
2020-04-18 20:09:31

మంచు మనోజ్ విడాకులతో అభిమానులు ఇప్పటికే షాక్ అయ్యారు. ఈ విషయం ఇంకా పచ్చిగానే ఉంది. ఆయన విడాకుల విషయాన్ని అంత త్వరగా అభిమానులు మరచిపోలేరు. పెళ్లయి మూడేళ్లు కూడా కాకముందే భార్యతో విడిపోయాడు ఈ మంచు వారబ్బాయి. దానికంటే ముందు అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకున్న తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. విశాల్, అనీషా రెడ్డి పెళ్లి కూడా ఆగిపోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వాళ్ళ పెళ్ళి జరగడం ఖాయం అని విశాల్ తండ్రి రెడ్డి విషయం కాని కన్ఫర్మ్ చేశారు. ఇలాంటి సమయంలో మరో టాలీవుడ్ జంట ఇప్పుడు విడాకుల వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

ఒక టాలీవుడ్ టాప్ యాంకర్ భర్తతో పడలేక విడాకులు తీసుకుందని ప్రచారం జరుగుతుంది. ఎన్ని రోజులు కేవలం ఇంట్లో పెద్ద వాళ్ల కోసం కలిసి ఉన్న ఆ జంట వాళ్లు వెళ్లిపోయిన తర్వాత విడిపోయారు అని తెలుస్తోంది. ఇంట్లో పెద్దవాళ్లు చనిపోయిన తర్వాత ఇద్దరూ వేరు వేరు ఇళ్ళల్లో ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 15 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని యాంకర్ గా ఆమె ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తోంది. అయితే కొన్ని సంవత్సరాలుగా భర్తతో ఆమెకు పొసగడం లేదని అందుకే గౌరవప్రదంగా ఇద్దరు పరస్పర ఒప్పందంతో విడిపోయారని ప్రచారం జరుగుతోంది.

ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఇక తమ ఇద్దరు పిల్లలని ఇప్పటికే పై చదువుల కోసం అమెరికా పంపించింది ఆ టాప్ యాంకర్. ప్రస్తుతం ఆమె భర్త మణికొండలో సపరేట్ ఫ్లాట్ తీసుకుని ఉంటే ఈమె సొంతంగా ఒక ఇల్లు కట్టుకొని ఒంటరిగా నివసిస్తోంది. కొన్నేళ్లపాటు బాగానే సాగినా కాపురం ఇప్పుడు మనస్పర్థల కారణంగా విడాకులు వరకు వచ్చిందని తెలుస్తుంది.

More Related Stories