భీష్మ బాలీవుడ్ రీమేక్ హీరో మారాడాbheeshma
2020-04-19 19:13:19

ప్రస్తుతం రీమేక్స్ యుగం నడుస్తోంది. ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో బాషలో పెద్దఎత్తున రీమేక్ చేస్తున్నారు. కంటెంట్ ఉంటె అది ఏ బాష సినిమా అని కూడా చూడకుండా తమ తమ బాషలలోకి రీమేక్ చేసుకుంటున్నారు మేకర్స్.  తాజాగా నితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీష్మ’ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ఇపుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి. ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ భారీ రేటుకే దక్కించుకున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాని రణ్‌బీర్ కపూర్‌తో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని ఒక వేళ రణ్‌బీర్ కపూర్ ఒప్పుకోకపోతే వరుణ్ ధావన్ లేదా టైగర్ ష్రాఫ్ హీరోగా రీమేక్ చేయాలనే ఆలోచనలో జోహార్ ఉన్నాడని ప్రచారం జరిగింది. కానీ రణబీర్ కపూర్ సహా మిగతా ఇద్దరికీ వరుస కమిట్మెంట్లు  ఉండటంతో, అర్జున్ కపూర్ ను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ లాక్ డౌన్ హడావిడి అంతా అయ్యాక హీరోయిన్ తదితర విషయాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే తెలియనున్నాయి.

 

More Related Stories