అప్పు తీసుకుంటా.. కానీ సాయం ఆపనంటున్న ప్రకాశ్ రాజ్..prakash
2020-04-21 08:02:20

లాక్ డౌన్ సమయంలో అందర్నీ ఆదుకోవడానికి అందరి దగ్గర సరైన వనరులు ఉండవు. కానీ ఉన్నదాంట్లోనే కొందరిని అయినా ఆదుకుంటే అంతకంటే కావాల్సిందేం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే చెప్పాడు. లాక్‌డౌన్‌ సందర్భంగా మీ చుట్టు పక్కల ఉన్న పేదవాళ్ల కడుపు నింపండి అంటూ ఆయన చెప్పాడు. నెల రోజుల నుంచి ప్రకాశ్ రాజ్ ఇదే పనిమీద ఉన్నాడు. తన వల్ల అయినంత వరకు అందరికీ సాయం చేస్తూనే ఉన్నాడు ఈయన. ఇప్పటికే చాలా మంది ఆకలి తీర్చాడు ఈయన. ఉపాధి లేక అల్లాడిపోతున్న వాళ్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నాడు. అంతేకాదు చాలా మంది వలస కూలీలకు కూడా తన ఫామ్ హౌజ్ ను వాడుకొమ్మని ఇచ్చేసాడు ప్రకాశ్ రాజ్. ఇప్పటికే తన ఆర్థిక వనరులు క్షీణిస్తున్నాయని..

అయినా కూడా సాయం చేయడం మాత్రం ఆపనంటున్నాడు ప్రకాశ్ రాజ్. కావాలంటే లోన్ తీసుకునైనా సరే కచ్చితంగా అందరికీ సాయం చేస్తూనే ఉంటానని చెప్పాడు ఈయన. కావాలంటే తాను మళ్లీ సంపాదించుకోగలనని.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మానవత్వంతో వ్యవహరించాలని చెప్పాడు ప్రకాశ్ రాజ్. మనమంతా కలిసి ఐకమత్యంతో పోరాడి కరోనాను జయిద్దామంటూ పిలుపునిచ్చాడు ప్రకాశ్ రాజ్. అవసరాల్లో ఉన్న వారికి చేయూతగా ఉందామని కోరుతున్నాడు. ప్రకాశ్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ముందడుగు వేస్తుందని చెప్పాడు ఈయన. ఇప్పటికే పేదల కోసం తన ఇల్లు, ఫాంహౌస్‌, నిర్మాణ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ముందుగానే మూడు నెలల జీతం ఇచ్చేశానని చెప్పాడు ప్రకాశ్ రాజ్. ఈయన ప్రస్తుతం 'పుష్ప'లో నటిస్తున్నాడు. దాంతో పాటే పవన్‌ కళ్యాణ్‌ 'వకీల్‌ సాబ్‌'లో.. రజనీకాంత్‌ అన్నాత్తై చిత్రంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు ఈయన.

More Related Stories