సోదరులతో కాళ్లు పట్టించుకుంటున్న పూజా హెగ్డే.. Pooja Hegde
2020-04-21 21:49:56

లాక్ డౌన్ సమయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇఫ్పుడు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా అంతే. ఈమె కూడా ప్రస్తుతం ఇంట్లోనే ఉంది. కాలు బయటపెట్టకుండా హాయిగా మహారాణిలా బతికేస్తుంది. అన్నాదమ్ములతో కాళ్లు పట్టించుకుంటుంది ఈ భామ. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఒకరు కాళ్లు పడుతుంటే.. మరొకరి భుజంపై పడుకుని ఉంది పూజా. బ్రదర్స్‌తో ఫుల్ ఎంజాయ్ అంటూ పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రభాస్ సినిమా కోసం యూరప్ వెళ్లి వచ్చిన తర్వాత 14 రోజులు క్వారంటైన్ లోనే ఉంది పూజా. ఆ తర్వాత బయటికి వచ్చింది. మరోవైపు ప్రభాస్ కూడా ఇదే చేసాడు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ఉన్నారు వీళ్ళు. కరోనాను అంతా కలిసి కట్టుగా ఉండి జయిద్దాం అంటుంది పూజా. ప్రస్తుతం ఈమె అఖిల్, ప్రభాస్ సినిమాలతో బిజీగా ఉంది. దాంతో పాటు జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో కూడా ఈమెనే అనుకుంటున్నారు.. కానీ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. 

More Related Stories