ప్రదీప్ సినిమాకు మగధీరతో పోలికలున్నాయా..?pradeep
2020-04-22 02:19:38

బుల్లితెరపై సూపర్‌ స్టార్‌‌గా వెలిగిపోతున్న యాంకర్ ప్రదీప్.. ఇప్పుడు హీరో కూడా అయిపోయాడు. ఈయన నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. ఎప్పుడు విడుదలవుతుందనేది కూడా అనుమానంగా మారింది. అయితే ఈ సినిమాలోని ఓ పాట మాత్రం ఇప్పటికే సంచలనం సృష్టించింది. నీలినీలి ఆకాశం పాటతో తన సినిమాపై అంచనాలు కూడా పెంచేసాడు ప్రదీప్. అయితే ఈ పాట చూసిన తర్వాత పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందనే అనుమానాలు అందర్లోనూ వచ్చాయి. మగధీరతో కూడా లింక్ పెట్టేసారు కొందరు. ఇందులో ప్రదీప్‌ రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నాడని పాటలు చూస్తుంటే అర్థమవుతుంది.

రెండు జన్మల ప్రేమకథగా దీన్ని కొత్త దర్శకుడు మున్నా తెరకెక్కించాని ప్రచారం కూడా జరిగింది. ముందు జన్మలో విడిపోయిన ప్రేమికులు తర్వాత జన్మలో కలుస్తారనే కాన్సెప్ట్ కూడా వినిపిస్తుంది. మగధీర ప్లాష్‌ బ్యాక్‌ మాదిరిగా ఈ సినిమాలో కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పల్లెటూరు ప్రాంతంలో జరిగే కథాంశం గత జన్మ కాగా.. కాలేజీ నేపథ్యంలో జరిగే కథ ప్రస్తుత జనరేషన్‌కు తగ్గట్లుగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు వినిపిస్తున్న సమాచారం. దాంతో ఇప్పుడు ఈ సినిమాపై ఆసక్తి కూడా బాగానే పెరిగిపోతుంది. అమృత అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

More Related Stories