మహేష్ బాబుకు కలిసిరాని కారెక్టర్ డిజైన్ చేస్తున్న రాజమౌళి..rajamouli
2020-04-24 14:20:41

రాజమౌళితో మహేష్ బాబు సినిమా ఇన్నాళ్లూ ఆలస్యం అయింది కానీ ఇప్పుడు దీని ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. ఇప్పటికే విజయేంద్రప్రసాద్ కథ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో అభిమానులు చూడానుకుంటున్న కాంబినేషన్ రాజమౌళి, మహేష్ బాబు. ఇప్పుడు అది వర్కవుట్ అవుతుంది. చాలా కాలం కింద కేఎల్ నారాయణ నిర్మాణంలో ఈ ఇద్దరి కలయికలో సినిమా ఉంటుందని అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది కానీ అది కుదర్లేదు. అయితే ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి.. ఆ తర్వాత వెంటనే మహేష్ బాబు సినిమా చేస్తానంటున్నాడు. ఇప్పటి వరకు ఈయన ప్రభాస్ తో మూడు.. ఎన్టీఆర్ తో మూడు.. చరణ్, నితిన్, సునీల్, నాని లాంటి హీరోలతో ఒక్కో సినిమా చేసాడు.

పవన్, బన్నీ, మహేష్ లాంటి హీరోలతో రాజమౌళి పని చేయలేదు. పవన్ కళ్యాణ్ తో తన సినిమా చేయలేను అని ఓపెన్ గానే చెప్పేసాడు రాజమౌళి. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాకి సిద్ధమవుతున్నాడు. అప్పట్లో మహేష్ బాబుతో సినిమా చేస్తే తాను జేమ్స్ బాండ్ కథ చేస్తానని చెప్పాడు రాజమౌళి. అయితే ఇప్పుడు కాస్త అదే తరహాలో ఉండే స్పై థ్రిల్లర్ కథ సిద్ధం చేస్తున్నాడు విజయేంద్రప్రసాద్. అయితే స్పై కథ మహేష్ బాబుకు కలిసి రాలేదు. స్పైడర్ అలాంటి కథతోనే వచ్చి డిజాస్టర్ అయింది. అయితే ఇక్కడున్నది రాజమౌళి కాబట్టి అభిమానులు కూడా కాన్పిడెంట్ గా కనిపిస్తున్నారు. 2021లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

More Related Stories