కరోనాపై పాట రాసి, పాడిన కమల్kamal
2020-04-24 08:16:51

కరోనా  మహమ్మారి నివారణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులను ప్రశంసిస్తూ.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పాటలను ఆలపించగా ఇప్పుడు ఆ లిస్టు లో నటుడు కమల్ హాసన్ కూడా చేరారు. దేశంలో ఉన్న పరిస్థితులను గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ.. పోలీసులకు, వైద్యులకు వందనం చేస్తూ పాటను రాశారు కమల్‌ హాసన్. అంతేకాకుండా ఆయనే స్వయంగా ఆ పాటను అలపించారు. జిబ్రాన్‌ సంగీతం అందించిన ఈ పాటను కమల్‌తోపాటు ఆనేక మంది తారలు గొంతు కలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కమల్‌తోపాటు ఇతర బృందం తమ సోషల్‌మీడియా ఖాతాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘అరివుమ్‌ అన్బుమ్‌’ (బుద్ధి, ప్రేమ) పేరుతో ఈ పాట విడుదలైంది. ఇందులో గొంతు కలిపిన వారిలో శంకర్‌ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్‌ శంకర్‌ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్‌ శ్రీరామ్, సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ముగెన్ త‌దిత‌రులు ఉన్నారు. ఈ సాంగ్‌ని పాడిన వారంద‌రు ఎవ‌రి ఇళ్ళ‌ల్లో వారు ఉండి రికార్డ్ చేశారు. పాట‌లో పోలీసులు, వైద్యులు,పారిశుద్ధ్య కార్మికుల త్యాగాల‌ని చూపిస్తూ వ‌ల‌స కార్మికులు ప‌డుతున్న ఇబ్బందుల గురించి చెప్పారు. కిలో మీటర్ల దూరం పిల్ల‌ల‌తో క‌లిసి న‌డిచి వెళుతున్న వారి బాధ‌ని సైతం పాట‌లో వ్య‌క్తం చేశారు. ఈ పాటకు  మంచి స్పందన వస్తోంది.

More Related Stories