జక్కన్న విషయంలో అదే నాకు నచ్చదంటున్న కీరవాణిRajamouli
2020-04-24 17:25:40

తెలుగు సినీ పరిశ్రమకు ఉన్న రత్నాల్లాంటి సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. ప్రస్తుతం వచ్చిన యువ సంగీత దర్శకులకు సైతం పోటీగా నిలుస్తూ ఇంకా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూనే వస్తున్నాడు. ‘బాహుబలి 2’ సమయంలో తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లుగా ఓసారి రిటైర్‌మెంట్ గురించి సీరియ‌స్‌ గా ట్వీట్ చేశాడు కీర‌వాణి. ఫ‌లానా సంవ‌త్సరం నుంచి నేను సినిమాలు మానేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు అనుకోండి అది వేరే విషయం. అయితే రాజమౌళి-కీరవాణి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసు. 

ఇక తాజాగా రాజమౌళిలో తనకి విషయం ఇదే అంటూ కొన్ని విషయాలు బయట పెట్టారు కీరవాణి. జక్కన్నకు ఏకాగ్రత చాలా ఎక్కువని, ఏదైనా అనుకుంటే దానిని సాధించేవరకు వదలరని చెప్పుకొచ్చారు కీరవాణి. ఒక సంకల్పంతో కష్టపడి పని చేసే మనస్తత్వం రాజమౌళిది అని, అదే తనలో బాగా నచ్చే విషయమని కీరవాణి అన్నారు. అయితే  ఖాళీ సమయం దొరికితే జక్కన్న ఎక్కువగా చిన్నపిల్లల సినిమాలు చూస్తుంటాడని, కాస్త మెచ్చుర్డ్ సినిమాలు చూడమని చెప్పినా వినకుండా అవే చూస్తారని చెప్పుకొచ్చారు కీరవాణి. అమెరికన్ కామెడీ డ్రామా 'ఫారెస్ట్ గంప్' సినిమా చూడమని చెబితే ఇంతవరకు చూడలేదని అన్నారు. రాజమౌళి విషయంలో ఇది తనకు నచ్చదని కీరవాణి చెప్పారు. ఇక ఈ ఇద్దరి కాంబోలో RRR సినిమా రాబోతున్న  సంగతి తెలిసిందే.  

More Related Stories