అప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్న రాజమౌళి..Rajamouli
2020-04-25 19:26:49

అదేంటి ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి అప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించడం ఏంటి.. మొన్నటికి మొన్న కొరటాల శివ కూడా ఇదే అన్నాడు.. ఐదేళ్ల తర్వాత ఆయన సినిమాలు చేయడం మానేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు రాజమౌళి ఏమంటున్నాడు అని కంగారు పడుతున్నారా.. ఈయన కూడా తన రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి చెప్పేశాడు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వచ్చిన సెలవులతో ఇంట్లోనే ఉండి అన్ని న్యూస్ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నాడు రాజమౌళి. 

ముఖ్యంగా తన రిటైర్మెంట్ గురించి కూడా ఓపెన్ అయిపోయాడు. మరో పది సంవత్సరాల వరకూ సినిమాలు చేస్తూనే ఉంటానని చెప్పాడు రాజమౌళి. ఒక్క సినిమా కోసం దాదాపు రెండు మూడు ఏళ్లు తీసుకుని దర్శక ధీరుడు వచ్చే పదేళ్లలో మహా అయితే మరో ఐదు నుంచి ఏడు సినిమాల వరకు చేస్తాడు. ఆ తర్వాత రిటైర్ అవుతా అంటున్నాడు రాజమౌళి. తన కుటుంబ సభ్యులు నల్లగొండ జిల్లాలోని ఈదులూరు గ్రామంలో ఉంటారని చెప్పాడు రాజమౌళి.. రిటైర్మెంట్ తర్వాత పిల్లలంతా స్థిరపడ్డాక అక్కడికి వెళ్లి వుండాలని ముందే ప్లాన్ చేసుకున్నట్లు చెప్పాడు దర్శక ధీరుడు. అక్కడే ఫామ్ హౌజ్ నిర్మించుకుని శేష జీవితాన్ని గడపాలని ఫిక్సైపోయినట్లు చెప్పాడు రాజమౌళి. ప్రస్తుతం ఈయన ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. 

More Related Stories