క్వారంటైన్‌లో చైతూ సమంత దినచర్య అదే..sam
2020-04-28 14:04:11

తెలుగు ఇండస్ట్రీలో సమంత అక్కినేని, చైతూ జోడీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వాళ్లిద్దరికీ ఎంత క్రేజ్ ఉందనేది అందరికీ తెలుసు. సాధారణంగా హీరోయిన్స్‌ పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తారు. కానీ సమంత మాత్రం చైతూ చొరవతో కంటిన్యూ చేస్తుంది. భర్త సపోర్ట్ లేకుండా తానేం చేయలేనని చెప్పేసింది సమంత. ఇదిలా ఉంటే ఇప్పుడు షూటింగ్స్ అన్నీ బంద్ అయిపోవడంతో ఇంట్లోనే ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నారు ఈ జోడీ. అందులో భాగంగానే చాలా రోజలు తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది సమంత. క్వారంటైన్ లో ఈ స్టార్స్ దినచర్య కూడా బాగానే ఉంది. పూర్తిగా టైమ్ టేబుల్ సెట్ చేసి పెట్టుకున్నారు చైస్యామ్. పొద్దున్నే లేవడం.. జిమ్ చేయడం.. స్విమ్ చేడయం కామన్.

ఆ తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకుని సెల్ఫీలు పెట్టి.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో గడపడం కూడా చేస్తున్నారు. ఇక సాయంత్రం అయితే తమ కుక్క పిల్లను తీసుకుని తాముండే అపార్ట్ మెంట్ చుట్టూ వాకింగ్ చేస్తున్నారు ఈ జంట. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం వైరట్ అవుతున్నాయి. అంతే కాదు.. మొన్నటికి మొన్న ఇంట్లో తన పెంపుడు కుక్కతో చైతూ పడుకున్న పిక్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పైగా క్వారెంటీమ్ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ క్వారంటైన్ సమయంలో హాయిగా వంటలు కూడా నేర్చుకుంటుంది సమంత. అమల చేసిన కామెంట్స్ సీరియస్ గా తీసుకుందో ఏమో కానీ వంటలన్నీ పర్ఫెక్ట్ అయిపోవాలని ఫిక్సైపోయింది అక్కినేని కోడలు. మొత్తానికి క్వారంటైన్ అంతా బిజీ బిజీగా గడిపేస్తున్నారు చైస్యామ్.

More Related Stories